Share News

వేసవిలో హాయిగొలిపేలా

ABN , Publish Date - Mar 12 , 2025 | 06:06 AM

మస్లిన్‌ కాటన్‌ అనే పేరున్న ఈ మల్‌ కాటన్‌ చీరలు శతాబ్దాలుగా వాడుకలో ఉన్నాయి. పర్షియా భాషలో మల్‌మల్‌ అనే పదానికి కాటన్‌ వూల్‌ అని అర్థం. పేరుకు తగ్గట్టే ఈ చీరలు ఎంతో మెత్తగా, సౌకర్యంగా..

వేసవిలో హాయిగొలిపేలా

ఫ్యాషన్‌

మల్‌ కాటన్‌

మస్లిన్‌ కాటన్‌ అనే పేరున్న ఈ మల్‌ కాటన్‌ చీరలు శతాబ్దాలుగా వాడుకలో ఉన్నాయి. పర్షియా భాషలో మల్‌మల్‌ అనే పదానికి కాటన్‌ వూల్‌ అని అర్థం. పేరుకు తగ్గట్టే ఈ చీరలు ఎంతో మెత్తగా, సౌకర్యంగా ఉంటాయి. ఈ మల్‌ వస్త్రం సహజసిద్ధ మెరుపు కోల్పోకుండా వేర్వేరు రంగులను అద్దే వీలుండడం వల్ల, మల్‌ కాటన్‌ చీరలను ఆకర్షణీయమైన ప్రింట్లలో తయారుచేస్తూ ఉంటారు. ప్రధానంగా చమటను పీల్చే గుణం కలిగి ఉండడం మూలంగా మల్‌ చీరలు వేసవిలో విపరీతంగా ఆదరణ పొందుతూ ఉంటాయి.

బగ్రు కాటన్‌

సహజసిద్ధ రంగులతో చేతి అద్దకంతో రూపొందే ఆకర్షణీయమైన బగ్రు చీరలకు రాజస్థాన్‌లోని బగ్రు ఎంతో ప్రసిద్ధి పొందింది. వందేళ్ల చరిత్ర కలిగిన బగ్రు అద్దకం కోసం డిజైన్లు చెక్కిన చెక్క బ్లాక్‌లను ఉపయోగిస్తారు. ఇండిగో, పసుపు మొదలైన సహజసిద్ధ రంగులతో రూపొందే బగ్రు చీరలు ఎక్కువ కాలం కూడా మన్నుతాయి.


మన్నిక ఇలా...

వేసవిలో ఎలాంటి కాటన్‌ చీరలను ఎంచుకున్నా, వాటి రంగులు వెలసిపోకుండా, నాణ్యత తగ్గిపోకుండా కాపాడుకోవడం కోసం ఈ చీరలను నీడలోనే ఆరబెట్టాలనే విషయం మర్చిపోకూడదు. అలాగే వాటిని ఉతికే విధానం కూడా సున్నితంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే కాటన్‌ చీరలు ఎక్కువ కాలం మన్నుతాయి.

వేసవిలో గాలి చొరబడే, తేలికపాటి కాటన్‌ చీరల ట్రెండ్‌ మొదలైపోతుంది. వీటిలో ప్రింటెడ్‌ కాటన్‌ చీరలు సర్వత్రా ఆదరణ పొందుతూ ఉంటాయి. అలాంటి కొన్ని కాటన్‌ చీరల మీద

ఓ లుక్కేద్దామా...

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ

Also Read: నా చేతిలో కత్తి పెట్టి..

Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 12 , 2025 | 06:06 AM