Share News

Vegetable Shopping Tips: తాజా కూరగాయలను ఇలా గుర్తించాలి

ABN , Publish Date - Aug 25 , 2025 | 01:01 AM

బజార్లో కూరగాయలు కొనేటప్పుడు అన్నీ బాగున్నట్లే కనిపిస్తుంటాయి. కానీ ఇంటికి తెచ్చిన మరుసటి రోజే పాడైపోతూ ఉంటాయి. అలాకాకుండా చిన్న చిట్కాలతో తాజా కూరగాయలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం...

Vegetable Shopping Tips: తాజా కూరగాయలను ఇలా గుర్తించాలి

బజార్లో కూరగాయలు కొనేటప్పుడు అన్నీ బాగున్నట్లే కనిపిస్తుంటాయి. కానీ ఇంటికి తెచ్చిన మరుసటి రోజే పాడైపోతూ ఉంటాయి. అలాకాకుండా చిన్న చిట్కాలతో తాజా కూరగాయలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం...

  • బంగాళ దుంపలు గుండ్రంగా, గోధుమ రంగులో ఉండాలి. ఆకుపచ్చ లేదా నల్లని మచ్చలు ఉన్న వాటిని కొనకూడదు. దుంప గట్టిగా ఉండాలి. ఏమాత్రం మెత్తగా అనిపించినా అవి తొందరగా పాడవుతాయని గుర్తించాలి.

  • నాలుగు లేదా అంతకుమించి తమ్మెలు ఉన్న క్యాప్సికమ్‌... ఎక్కువ గింజలతో తియ్యగా ఉంటుంది. మూడు తమ్మెలు ఉన్నవి ఒక్కోసారి చేదుగా ఉండవచ్చు.

  • టమాటాలు కొనేటప్పుడు లేత పసుపు రంగులో గుండ్రంగా గట్టిగా ఉన్నవాటిని ఎంచుకోవాలి. ఎర్రగా మెత్తగా ఉండేవి తొందరగా పాడవుతాయి. ఆకుపచ్చగా కనిపించేవి చేదుగా ఉండవచ్చు.

  • బీన్స్‌ కొనేటప్పుడు ఒకదాన్ని మధ్యకు విరిస్తే తేలికగా విరిగినట్లయితే అవి తాజావని గుర్తించాలి. ఆకుపచ్చని రంగులో సన్నగా నిటారుగా ఉన్నవి కూరకు బాగుంటాయి. లేత పసుపు రంగులో కాస్త లావుగా ఉంటే అవి ముదిరినవని అర్థం.

  • పొట్లకాయ, సొరకాయలను బొటనవేలి గోటితో గుచ్చినప్పుడు లోతైన ఆకుపచ్చని గుర్తు ఏర్పడితే అవి తాజా కాయలని చెప్పవచ్చు.

  • బెండకాయలు నున్నగా, సన్నగా ఉంటే లేత కాయలని తెలుసుకోవచ్చు. వీటి కొనలను చేత్తో విరిస్తే విరుగుతాయి. అలా విరగకపోయినా వాటిపై సన్నని నూగు కనిపిస్తున్నా, మరీ లావుగా ఉన్నా వాటిని ముదురు కాయలుగా గుర్తించాలి.

  • దోసకాయలు.... గట్టిగా ముదురు ఎరుపు రంగులో ఉన్నవాటిని మాత్రమే తీసుకోవాలి. ఇవి పులుపు లేదా తీపి రుచుల్లో ఉంటాయి. బంగారు లేదా లేత పసుపు రంగులో ఉండేవి, ఆకుపచ్చని చారలు ఉన్నవి ఒక్కోసారి చేదుగా ఉండవచ్చు.

  • దొండకాయలు కొనేటప్పుడు గట్టిగా ఉన్నవాటినే ఏరుకోవాలి. మెత్తగా ఉంటే పండినవని గుర్తించాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 01:02 AM