Share News

Children Memory Tips: పిల్లల జ్ఞాపకశక్తి కోసం

ABN , Publish Date - Sep 03 , 2025 | 02:24 AM

కొంతమంది పిల్లలు ఎంత బాగా చదివినప్పటికీ మరుసటిరోజే అన్నీ మర్చిపోతుంటారు. అలాకాకుండా పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...

Children Memory Tips: పిల్లల జ్ఞాపకశక్తి కోసం

కొంతమంది పిల్లలు ఎంత బాగా చదివినప్పటికీ మరుసటిరోజే అన్నీ మర్చిపోతుంటారు. అలాకాకుండా పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...

  • మెదడు సమర్థవంతంగా పనిచేయాలంటే శరీరానికి విశ్రాంతి, నిద్ర అత్యవసరం. పిల్లలు రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గంటల వరకు హాయిగా నిద్రపోవాలి. అప్పుడే వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. టీవీ, మొబైల్‌, ల్యాప్‌టా్‌పల వాడకంపై పరిమితులు విధించి పిల్లలు సమయానుసారం నిద్రించేలా చూసుకోవాలి.

  • కొంతమంది పిల్లలు ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా పాలు తాగకుండా బడికి బయలుదేరుతుంటారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. తృణధాన్యాలతో తయారుచేసిన ఆహారపదార్థాలు, తేలికగా జీర్ణమయ్యే వంటకాలు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌ లాంటివాటిని పిల్లలకు అల్పాహారంగా తినిపించాలి. దీనివల్ల మెదడుకు పోషకాలు, శక్తి చేకూరుతాయి. బడిలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను పిల్లలు చక్కగా అర్థం చేసుకుని తేలికగా గుర్తుపెట్టుకోగల్గుతారు.

  • పిల్లలతో చదరంగం, క్యారమ్స్‌, మెమరీ కార్డ్‌ లాంటి ఆటలు ఆడించాలి. పజిల్స్‌ సాల్వ్‌ చేయడం, సుడోకు లాంటి పదబంధాలను పూరించడం అలవాటు చేయాలి. వీటివల్ల మెదడుకు తగినంత వ్యాయామం లభిస్తుంది. దీంతో పిల్లలకు ఆలోచన సామర్థ్యం, జ్ఞాపకశక్తి చక్కగా పెరుగుతాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసులపై కాల్పులు.. రేప్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పరార్..

సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర

For More National News

Updated Date - Sep 03 , 2025 | 02:24 AM