Whiter Teeth Tips: తెల్లని దంతాల కోసం
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:34 AM
పోషకాహార లోపం, సరైన పద్ధతిలో శుభ్రం చేసుకోకపోవడం లాంటి కారణాల వల్ల కొంతమందిలో దంతాలు పసుపురంగులోకి మారతాయి. కొన్ని చిట్కాలు పాటించి దంతాలను తెల్లగా మెరిపించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు....
పోషకాహార లోపం, సరైన పద్ధతిలో శుభ్రం చేసుకోకపోవడం లాంటి కారణాల వల్ల కొంతమందిలో దంతాలు పసుపురంగులోకి మారతాయి. కొన్ని చిట్కాలు పాటించి దంతాలను తెల్లగా మెరిపించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చిన్న గిన్నెలో ఒక చెంచా అల్లం పేస్టు, అర చెంచా నిమ్మరసం, పావు చెంచా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టూత్‌బ్ర్‌షతో అద్ది దానితో దంతాలపై వృత్తాకారంలో మెల్లగా తోమి, గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే క్రమంగా దంతాలపై పసుపుదనం తొలగిపోతుంది.
తరచూ జామ, యాపిల్, స్ట్రాబెర్రీ, రేగు, నారింజ, బత్తాయి, ద్రాక్ష లాంటి పండ్లను తినడం వల్ల వాటిలోని పోషకాలు లాలాజలంతో కలిసి దంతాలను తెల్లగా మారుస్తాయి.
అప్పుడప్పుడు నిమ్మ, నారింజ, అరటిపండు తొక్కలతో తోముతూ ఉంటే వాటిలోని సిట్రిక్ యాసిడ్, డి-లిమోనినే సమ్మేళనాలు కలిసి దంతాలను తెల్లగా మెరిపిస్తాయి.
బొప్పాయిలోని పపైన్, అనాసలోని బ్రోమలైన్ ఎంజైమ్‌లు దంతాల పసుపుదనాన్ని తగ్గిస్తాయి. తరచూ ఈ పండ్లు తినడంతోపాటు ఈ ఎంజైమ్స్ ఉన్న టూత్‌పేస్టును ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
కాఫీ, టీ, రెడ్‌వైన్ లాంటివి తాగినప్పుడు అలాగే బీట్‌రూట్, బ్లూ బెర్రీ లాంటి పండ్లు తిన్నప్పుడు కొద్దిసేపటి తరువాతనైనా దంతాలను శుభ్రం చేసుకోవడం మంచిది.
వారానికి ఒకసారి దంతాలను యాక్టివేటెడ్ చార్‌కోల్‌తో తోముకున్నా ప్రయోజనం ఉంటుంది.
ఒక గిన్నెలో రెండు చెంచాల బేకింగ్ సోడా, ఒక చెంచా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి తగినన్ని నీళ్లు చిలకరించుకుంటూ పేస్టులా చేయాలి. ఈ పేస్టుతో తోముకుంటే వెంటనే దంతాల పసుపుదనం మాయమవుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ లేదా కొబ్బరినూనెలో చూపుడు వేలును ముంచి దానితో పళ్లను రుద్దితే సమస్య తీరుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
Read Latest AP News And Telugu News