Share News

పాత్రలపై మొండి మరకలను ఇలా తొలగించాలి..!

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:56 AM

ప్రతిరోజూ వంట కోసం వాడే పాత్రలపై మొండి మరకలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తొలగించిన తరవాతే ఆ పాత్రలను తిరిగి...

పాత్రలపై మొండి మరకలను ఇలా తొలగించాలి..!

ప్రతిరోజూ వంట కోసం వాడే పాత్రలపై మొండి మరకలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తొలగించిన తరవాతే ఆ పాత్రలను తిరిగి ఉపయోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వంట పాత్రలపై నిలిచే మరకలు, వాసనలను తేలికగా పోగొట్టే చిట్కాల గురించి తెలుసుకుందాం.

  • రాత్రిపూట ఒక గిన్నెలో ఒక కప్పు వేడి నీళ్లు, రెండు చెంచాల డిష్‌ వాష్‌ లిక్విడ్‌ వేసి బాగా కలిపి ఉంచాలి. మరుసటి రోజు ఈ మిశ్రమంలో స్క్రబ్బర్‌ ముంచి దానితో పాత్రలను తోమి తరవాత నీటితో కడగాలి. దీంతో పాత్రల లోపలి భాగంలో ఏర్పడిన మరకలు, వండిన పదార్థాల వాసనలు తొలగిపోతాయి.

  • ఒక గిన్నెలో నాలుగు చెంచాల బేకింగ్‌ సోడా వేసి దానికి రెండు చెంచాల నీళ్లు కలిపి పేస్టులా చేయాలి. స్కబ్బర్‌తో ఈ పేస్టుని కొద్దిగా తీసుకుంటూ పాత్రలను తోమాలి. తరవాత నీటితో శుభ్రం చేస్తే మసి, జిడ్డు తొలగి పోయి పాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి.


  • ఒక పళ్లెంలో మూడు చెంచాల రాళ్ల ఉప్పు తీసుకోవాలి. సగానికి కోసిన నిమ్మకాయ చెక్కతో ఈ ఉప్పుని అద్ది దానితో వంట పాత్రలను తోమి వేడినీళ్లతో శుభ్రం చేయాలి. దీంతో పాత్రలకు పట్టిన వాసనలు పూర్తిగా పోతాయి.

  • పాత్రలు మాడిపోతూ ఉంటాయి. ఈ పాత్రల్లో సగం వరకూ నీళ్లు పోసి రెండు చెంచాల ఉప్పు, రెండు చెంచాల డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌, రెండు చెంచాల నిమ్మరసం వేసి స్టవ్‌ మీద పెట్టి వేడి చేయాలి. అయిదు నిమిషాల తరవాత స్టవ్‌ మీద నుంచి దించి అరగంటసేపు నాననిచ్చి స్క్రబ్బర్‌తో రుద్దితే పాత్రల్లోని మాడు మరకలు పోతాయి.

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ

Also Read: నా చేతిలో కత్తి పెట్టి..

Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 12 , 2025 | 05:57 AM