The Unique Benefits of Kalonji: కళోంజి కథే వేరు
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:55 AM
కళోంజి, లేదా కాలా జీరా ఆరోగ్యాన్ని అందించే ఒక ప్రత్యేకమైన దినుసుగా పేరు పొందింది. ప్రాచీన ఈజిప్టు సమాధుల్లో, చారిత్రక వైద్య ప్రతుల్లో స్థానం సంపాదించుకున్న ఈ చిన్న విత్తనం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!...
కళోంజి, లేదా కాలా జీరా ఆరోగ్యాన్ని అందించే ఒక ప్రత్యేకమైన దినుసుగా పేరు పొందింది. ప్రాచీన ఈజిప్టు సమాధుల్లో, చారిత్రక వైద్య ప్రతుల్లో స్థానం సంపాదించుకున్న ఈ చిన్న విత్తనం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!
మూత్రపిండాల్లోని రాళ్ల పరిమాణాన్ని తగ్గించడంలో, వాటిని కరిగించడంలో కళోంజి ఎంతో బాగా సహాయపడుతుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ విత్తనం ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడం కోసం 2019 ఒక ప్రయోగాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ ప్రయోగంలో భాగంగా మూత్రపిండాల రాళ్లతో బాధపడుతున్న 60 మంది రోగులకు రోజుకు రెండు సార్లు చొప్పున పది రోజుల పాటు 500 మిల్లీగ్రాముల కళోంజీని అందించినప్పుడు, కళోంజి తీసుకున్న 44 శాతం మందిలో, మూత్రపిండాల్లోని రాళ్లు బయటకు వచ్చేశాయి. 50 శాతం మంది మూత్రపిండాల్లోని రాళ్ల పరిమాణం తగ్గిపోయింది. దీన్ని బట్టి కళోంజి మూత్రపిండాల రోగులకు వరప్రదాయనిగా ఉపయోగపడుతుందని తేలింది. ఈ విత్తనాల్లోని థైమోక్వినోన్ అనే మూలకం యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉండడంతో పాటు మూత్రపిండాలకు ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడంతో పాటు, వ్యాధినిరోధకశక్తిని మెరుగుపరచడం, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడం, రక్తపోటు, మధుమేహాల అదుపుకు తోడ్పడడం, జీర్ణశక్తిని మెరుగుపరచడం మొదలైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News