Share News

Sri Sri Ravishankar : మనసు ఏం చేస్తోందో గమనిస్తున్నారా?

ABN , Publish Date - Feb 06 , 2025 | 10:35 PM

మనస్సుకు మరో ధోరణి కూడా ఉంది. అది: ప్రతికూలతను అంటిపెట్టుకొని ఉండడం. మన జీవితంలో పది సందర్భాలు, సంఘటనల్లో ఒకటి ప్రతికూలంగా జరిగితే... అనుకూలంగా జరిగినవాటిని మరచిపోతాం. ఆ ఒక్క ప్రతికూలమైన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం.

Sri Sri Ravishankar : మనసు ఏం చేస్తోందో గమనిస్తున్నారా?

మనస్సుకు మరో ధోరణి కూడా ఉంది. అది: ప్రతికూలతను అంటిపెట్టుకొని ఉండడం. మన జీవితంలో పది సందర్భాలు, సంఘటనల్లో ఒకటి ప్రతికూలంగా జరిగితే... అనుకూలంగా జరిగినవాటిని మరచిపోతాం. ఆ ఒక్క ప్రతికూలమైన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం.

విద్యను, సమాచారాన్ని పొందడానికి మనకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. పాఠశాలకు, కళాశాలకు, విశ్వవిద్యాలయానికి వెళ్ళడం ద్వారా, గురువుల ద్వారా విద్యను సంపాదించగలం. వార్తా పత్రికల ద్వారా ఇతర మాధ్యమాల ద్వారా సమాచారం తెలుసుకోగలం. పుస్తకాలను చదవడం ద్వారా విజ్ఞానాన్ని పొందగలం. ఇలా మనకు ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. కానీ జ్ఞానం పొందాలంటే ఇలాంటి మార్గాల ద్వారా సాధ్యం కాదు. మన మనసులో ప్రస్తుతం ఏం జరుగుతోందో తెలుసుకోవడమే జ్ఞానం. కానీ మనసు గురించి అవగాహన చేసుకోవడానికి ఇతర మార్గాలేవీ దోహదపడవు.


ప్రతి క్షణం మీ మనసు ఏం చేస్తోందో, అక్కడ ఏం జరుగుతోందో మీరు గమనించారా? తరువాత జరగబోయేది ఏమిటో అది ఆలోచిస్తూ ఉంటుంది. అది గతానికి, భవిష్యత్తుకు మధ్య ఊగిలాడుతూ ఉంటుంది. గతంలో జరిగిన దాని గురించి విచారంగా, లేదా కోపంగా ఉంటుంది. లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంది. మనస్సుకు మరో ధోరణి కూడా ఉంది. అది: ప్రతికూలతను అంటిపెట్టుకొని ఉండడం. మన జీవితంలో పది సందర్భాలు, సంఘటనల్లో ఒకటి ప్రతికూలంగా జరిగితే... అనుకూలంగా జరిగినవాటిని మరచిపోతాం. ఆ ఒక్క ప్రతికూలమైన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. ఈ ధోరణిని మార్చుకోవడమే మీకు మీరు చేసుకోగలిగే పెద్ద సహాయం. ఈ ధోరణి గురించి అర్థం చేసుకోవడం వల్ల మీ జీవితం మరింత సహజంగా, మరింత సరళంగా మారుతుంది. అంతర్గతమైన వికాసం కలుగుతుంది. నిజానికి మనం పుట్టినప్పుడు ఎంతో అమాయకంగా ఉంటాం. పరిణతి చెందుతున్నకొద్దీ, తెలివైనవారిగా మారుతున్న కొద్దీ ఆ అమాయకత్వాన్ని కోల్పోతాం. చివరకు కఠినంగా మారుతాం. దానివల్ల జీవితంలో ఆనందం కోల్పోతాం. ఆ కాఠిన్యాన్ని విడిచిపెట్టండి. అందరిపట్ల, అన్నిటిపట్ల దయగా, ప్రేమగా ఉండండి. అప్పుడు జీవితం మరింత ఆనందదాయకంగా, మరింత సంతృప్తికరంగా, ఆసక్తికరంగా మారుతుంది. ఇదంతా మీ మనసును అవగాహన చేసుకున్నప్పుడు, జరుగుతుంది. అందుకోసం మనసు ఏం చేస్తోందో గమనించాలి. ప్రతికూలమైన విషయాల గురించి ఆలోచించడం మానేయాలి. సానుకూలమైన దృక్పథంతో జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు అంతా ఆనందమే!

శ్రీశ్రీరవిశంకర్‌


మరిన్ని వార్తల కోసం..

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 06 , 2025 | 10:35 PM