Benefits Of Fenugreek Leaves: మేలు చేసే మెంతి
ABN , Publish Date - Jul 19 , 2025 | 06:22 AM
మెంతి కూరని దీపనీ అంటారు. జఠరాగ్ని రాజిల్లజేస్తుంది కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. మెంతి కూర చేదుగా ఉంటుంది
మెంతి కూరని దీపనీ అంటారు. జఠరాగ్ని రాజిల్లజేస్తుంది కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. మెంతి కూర చేదుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. మేథస్సుని పెంపు చేస్తుంది కాబట్టి మెంతికూరను ‘మేథీ’ అని కూడా అంటారు. దీనిని కొన్ని ప్రాంతాల్లో జ్యోతి అని కూడా పిలుస్తారు. దీనివల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.. అవేమిటో చూద్దాం..
మెంతి కూర నాలుక మీద జిగురును తొలగిస్తుంది. నాలుకకు రుచి తెలిసేలా చేస్తుంది.
వాత వ్యాధులతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. ఇది వేడిని పెంచుతుంది. అదే సమయంలో ఇది ఎసిడిటి పెంచుతుంది. అందువల్ల దీనిని కొద్దిగా తింటేనే మంచిది.
అన్నం సహించటం లేదని సరిగ్గా తిండి అరగని వారికి మెంతికూర నోటికి రుచిని
కలిగిస్తుంది.
మధుమేహ వ్యాధి ఉన్నవారికి ఇది దివ్య ఔషధం. ప్రతి రోజూ క్రమం తప్పకుండా మెంతి కూర తింటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
మన శరీరంలోని విష దోషాలను ఇది హరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
రుతుస్రావం రాని వారు ప్రతి రోజు మెంతి కూర తింటే మంచిది. గర్భశయ దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి.
ఉబ్బస రోగులకు కూడా మెంతి కూర ఉపకరిస్తుంది. మెంతి కూర ఆకుల్ని సన్నగా తరిగి కందిపప్పుతో ఉడికించి.. తాలింపు పెడితే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.
మెంతి ఆకులను ఎండబెట్టి మెత్తగా దంచి సీసాలో భద్రపరుచుకుంటారు. ఈ పొడిని కసూరి మెంతి అని పిలుస్తారు. అన్ని రకాల కూరలలోను దీనిని ఉపయోగించుకోవచ్చు.
మెంతి ఆకుల గుజ్జును తలకు పట్టిస్తే జుట్టు మృదువుగా ఉంటుంది. ఈ గుజ్జును ముఖానికి రాసుకుంటే మెటిమలు తగ్గుతాయి.
- గంగరాజు అరుణాదేవి
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి