Tamarind Health Benefits: ప్లాస్టిక్‌ను వదిలించే చింతపండు
ABN , Publish Date - Sep 16 , 2025 | 02:24 AM
చింతపండు కలిగి ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకున్న అవగాహన తక్కువే! కానీ చింతపండుతో ఒరిగే ఒక ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాన్ని తాజా పరిశోధన బహిర్గతం చేసింది. అదేంటంటే....
పరిశోధన
చింతపండు కలిగి ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకున్న అవగాహన తక్కువే! కానీ చింతపండుతో ఒరిగే ఒక ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాన్ని తాజా పరిశోధన బహిర్గతం చేసింది. అదేంటంటే....
మన శరీరంలోకి చేరుకునే మైక్రోప్లాస్టిక్స్ ఎంతటి ఆరోగ్య ముప్పును తెచ్చి పెడతాయో అందరికీ తెలిసిందే! అయితే వీటిని శరీరం నుంచి తొలగించే మహత్తరమైన శక్తి చింతపండుకు ఉందని తాజా పరిశోధనలో బహిర్గతమైంది. చింతపండు సారం, శరరంలోని మైక్రోప్లాస్టిక్ అణువులతో పరస్పర చర్య జరుపుతున్నట్టు నియంత్రిత ప్రయోగాల్లో వెల్లడైంది. ప్రయోగశాలల్లో చేపట్టిన పరీక్షల్లో చింతపండు సారం, నీళ్లలోని 90ు మైక్రోప్లాస్టిక్స్‌ను తొలగించడాన్ని పరిశోధకులు కనిపెట్టారు. చింతపండులోని కాంపౌండ్స్, సహజసిద్ధ పాలిమర్స్‌ను సృష్టించడమే ఇందుకు కారణం. ఈ పాలిమర్స్ సూక్ష్మప్లాస్టిక్స్‌ను వెతికి బంధించడమే కాకుండా, వాటిని తమతో పాటు మోసుకుపోతున్నట్టు పరిశోధకులు కనిపెట్టారు. అయితే సూక్ష్మప్లాస్టిక్స్ నుంచి మనుషులను డిటాక్స్ చేయడానికి చింతపండు ఉపయోగపడుతుందని నిర్థారించడానికి మరికొన్ని అధ్యయనాలు అవసరమవుతాయనీ, తాజా పరిశోధనతో ప్లాస్టిక్ కాలుష్యానికి సహజసిద్ధ పరిష్కారాల పట్ల ఆసక్తి పెరుగుతుందనీ పరిశోధకులు అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News