Share News

Peplum Tops Fashion: పసందైన పెప్లమ్‌

ABN , Publish Date - Dec 17 , 2025 | 01:20 AM

జీన్స్‌తో కలిపి ధరించే టాప్స్‌లో పెప్లమ్‌ టాప్స్‌ ప్రత్యేకంగా ఉంటాయి. రొటీన్‌కు భిన్నంగా కనిపించాలనుకునే మహిళలు తప్పనిసరిగా...

Peplum Tops Fashion: పసందైన పెప్లమ్‌

ఫ్యాషన్‌

జీన్స్‌తో కలిపి ధరించే టాప్స్‌లో పెప్లమ్‌ టాప్స్‌ ప్రత్యేకంగా ఉంటాయి. రొటీన్‌కు భిన్నంగా కనిపించాలనుకునే మహిళలు తప్పనిసరిగా ఎంచుకోవలసిన టాప్స్‌ ఇవి. దుస్తులకు వినూత్నమైన ఆకర్షణను తెచ్చిపెట్టే ఈ కుచ్చుల టాప్స్‌ మీకోసం...

  • నడుము దగ్గర కనిపించే కుచ్చుల వల్ల ఎబ్బెట్టుగా కనిపిస్తామేమోననే భయం అవసరం లేదు. నిజానికి పెప్లమ్‌ శరీర సౌష్టవాన్ని ఇంపుగా కనిపించేలా చేస్తుంది. అవర్‌ గ్లాస్‌ శరీరాకృతిని కోరుకుకునేవారు ఈ తరహా టాప్స్‌ను నిస్సందేహంగా ఎంచుకోవచ్చు.

  • పెప్లమ్‌ టాప్స్‌ను లెహంగాతో కూడా కలిపి వేసుకోవచ్చు. అయితే నడుముకు బెల్ట్‌, మెడకు చున్నీ తప్పనిసరి. ధరించే లెహెంగాను బట్టి యాక్సెసరీస్‌ ఎంచుకోవాలి. డ్రెస్‌ భారీగా ఉంటే ఆభరణాలు సింపుల్‌గా ఉండేలా చూసుకోవాలి. హైహీల్స్‌ తప్పక ధరించాలి.

  • సెక్విన్‌, శాటిన్‌, గోల్డ్‌ వర్క్‌, నెట్‌... ఎలాంటి మెటీరియల్‌ అయినా పెప్లమ్‌ స్టైల్‌కు చక్కగా సూటవుతుంది. వేడుకలకు తగినట్టుగా సందర్భానుసారంగా తయారవాలనుకుంటే అందుకు తగినంత హెవీగా పెప్లమ్‌ టాప్‌ ఎంచుకుంటే సరిపోతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!

తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్

For More AP News And Telugu News

Updated Date - Dec 17 , 2025 | 01:20 AM