Diet Sodas Health Risks: డైట్ సోడాలతో చేటు
ABN , Publish Date - Sep 16 , 2025 | 02:31 AM
క్యాలరీలను తగ్గించుకోవాలనే ఆలోచనతో డైట్ సోడాలను ఎంచుకుంటున్నారా? నిజానికి వాటితో మధుమేహం ముప్పు పొంచి ఉంటుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి...
అధ్యయనం
క్యాలరీలను తగ్గించుకోవాలనే ఆలోచనతో డైట్ సోడాలను ఎంచుకుంటున్నారా? నిజానికి వాటితో మధుమేహం ముప్పు పొంచి ఉంటుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.
డైట్ సోడాలతో సాధారణ సోడాలకు మించి మధుమేహ ముప్పు పొంచి ఉంటుంది. రోజుకొక డైట్ సోడాతో 36ు టైప్ 2 మధుమేహం ముప్పు ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. 14 ఏళ్ల పాటు 36 వేల మంది మీద చేపట్టిన ఒక పరిశోధనలో, రోజుకొక కృత్రిమ తీపి పానీయం తాగిన వారిలో టైప్2 మధుమేహం ముప్పు, సాధారణ తీపి పానీయం తాగే వారి కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అలాగే డైట్ సోడాల్లోని కృత్రిమ కొవ్వులు పేగుల్లోని బ్యాక్టీరియాను అస్తవ్యస్థం చేస్తాయనీ, ఇన్సులిన్ సంకేతాలను ప్రభావితం చేస్తాయనీ, రక్తంలోని చక్కెరను క్రమబద్ధీకరించుకోవడంలో శరీర సామర్ధ్యాన్ని అయోమయానికి గురి చేస్తాయనీ పరిశోధకులు అంటున్నారు. డైట్ సోడాల్లోని ఆస్పర్టేమ్, సుక్రలోజ్‌లు మధుమేహ ముప్పును మధుమేహ ముప్పును పెంచడంతో పాటు స్థూలకాయానికి కూడా దోహదపడతాయి కాబట్టి అన్ని రకాల శీతల పానీయాలకు దూరంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News