Share News

Strengthening Bone Density: ఎముకల దృఢత్వం 30 ఏళ్ల లోపే

ABN , Publish Date - Oct 14 , 2025 | 05:53 AM

30 ఏళ్లు దాటిన మహిళల్లో ఎముకలు గుల్లబారే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఒక చిట్కా పాటించాలి. మహిళల్లో ఎముకలు 30 ఏళ్ల వయసుకు పతాక స్థాయి దృఢత్వానికి...

Strengthening Bone Density: ఎముకల దృఢత్వం 30 ఏళ్ల లోపే

మహిళల ఆరోగ్యం

30 ఏళ్లు దాటిన మహిళల్లో ఎముకలు గుల్లబారే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఒక చిట్కా పాటించాలి. మహిళల్లో ఎముకలు 30 ఏళ్ల వయసుకు పతాక స్థాయి దృఢత్వానికి చేరుకుని, ఆ తర్వాత నుంచి క్రమేపీ బలహీనపడుతూ పెళుసుగా మారి విరిగిపోయే స్వభావాన్ని అలవరుచుకుంటాయి. కాబట్టి ప్రతి మహిళా 30 ఏళ్ల వయసుకు చేరుకునే సమయానికి ఎముకల సాంద్రత గరిష్ఠ స్థాయికి చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం వ్యాయామం, పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడే జీవనశైలిని అనుసరించిన మహిళల్లో ఎముకల క్షీణత తక్కువగా ఉన్నట్టు అధ్యయనాలు సైతం నిరూపించాయి. కాబట్టి ఆహారంలో మాంసకృత్తులు అధికంగా ఉండేలా చూసుకోవాలి. బరువులెత్తే వ్యాయామాలు చేయాలి. ఈ వ్యాయామాలు ఎముకల సాంద్రతనూ, కండరపుష్టినీ పెంచేలా ఉండాలి. మెగ్నీషియం మోతాదు తగ్గితే ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. కాబట్టి మెగ్నీషియం కలిగి ఉండే బాదం, జీడిపప్పు, గుమ్మడి విత్తనాలు, పాలకూర తింటూ ఉండాలి. అలాగే ఎముకల దృఢత్వాన్ని పెంచే విటమిన్‌ కె కోసం, బ్రొకొలి, సోయాబీన్స్‌ తీసుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 05:53 AM