Share News

ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్లు

ABN , Publish Date - Jul 07 , 2025 | 05:06 AM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 541 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు...

ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్లు

ఖాళీలు 541

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 541 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ: 80, ఎస్టీ: 73, ఓబీసీ: 135,

ఈడబ్ల్యూఎస్‌: 50, యూఆర్‌: 203

అర్హత: గ్రాడ్యుయేషన్‌. ఫైనలియర్‌ విద్యార్థులూ దరఖాస్తు చేయొచ్చు. అయితే 2025 సెప్టెంబర్‌ 30వ తేదీలోగా డిగ్రీ సర్టిఫికెట్‌ సమర్పించాల్సి ఉంటుంది. మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, సీఏ తదితర విద్యార్థులూ అర్హులే.

వయస్సు: 2025 ఏప్రిల్‌ 1 తేదీ నాటికి వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్‌ అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

చివరి తేదీ: 2025 జూలై 14

వెబ్‌సైట్‌: https://sbi.co.in/

ఈ వార్తలు కూడా చదవండి

సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం

డిజిటల్‌ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 05:06 AM