స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జాబ్స్
ABN , Publish Date - Jul 07 , 2025 | 05:00 AM
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్ టెక్నికల్), హవల్దార్(సీబీఐసీ అండ్ సీబీఎన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది....
మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్ టెక్నికల్)
పోస్టులు 1075
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్ టెక్నికల్), హవల్దార్(సీబీఐసీ అండ్ సీబీఎన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 1075 పోస్టులు ఉన్నాయి. పదో తరగతి పాసైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్లలను అనుసరించి గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. శారీర సామర్థ్యం, రాత పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
చివరి తేదీ: 2025 జూలై 24 వెబ్‌సైట్: ssc.gov.in
జూనియర్ ఇంజనీర్లు
పోస్టులు1340
వివిధ డిపార్ట్‌మెంట్లలో ఖాళీగా ఉన్న 1340 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఖాళీల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రిల్ ఇంజనీర్ల పోస్టులు ఉన్నాయి(డిపార్ట్‌మెంట్ వారీగా ఖాళీల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు). వయస్సు: పోస్టులను బట్టి కొన్నింటికి 30, మరికొన్నింటికి 32 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితి ఉంది.
చివరి తేదీ: 2025 జూలై 22 వెబ్‌సైట్: ssc.gov.in/
ఈ వార్తలు కూడా చదవండి
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం
డిజిటల్ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ
Read Latest Telangana News And Telugu News