Spotting During Pregnancy: గర్భధారణ రక్తస్రావం
ABN , Publish Date - Sep 25 , 2025 | 02:19 AM
వైద్య పరిభాషలో దీన్ని ‘స్పాటింగ్’ అంటారు. పది శాతం ఆరోగ్యకరమైన గర్భిణుల్లో ఈ లక్షణం కనిపిస్తుంది. అయితే ఈ లక్షణం తీవ్రత, పర్యవసానాలు, గర్భఽధారణ తర్వాతి తొలి, మలి నెలల మీద ఆధారపడి ఉంటాయి...
కౌన్సెలింగ్
గర్భధారణ - రక్తస్రావం
డాక్టర్! నాకు 30 ఏళ్లు. గర్భధారణ తర్వాత నెలసరి ఆగిపోయినా, అప్పుడప్పుడూ ఎంతో తక్కువగా రక్తస్రావం కనిపిస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ఇది సహజమేనా?
ఓ సోదరి, హైదరాబాద్
వైద్య పరిభాషలో దీన్ని ‘స్పాటింగ్’ అంటారు. పది శాతం ఆరోగ్యకరమైన గర్భిణుల్లో ఈ లక్షణం కనిపిస్తుంది. అయితే ఈ లక్షణం తీవ్రత, పర్యవసానాలు, గర్భఽధారణ తర్వాతి తొలి, మలి నెలల మీద ఆధారపడి ఉంటాయి. గర్భం దాల్చిన తొలినాళ్లలో తేలికపాటి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కనిపించవచ్చు. లేదా గర్భాశయ ముఖద్వారం దగ్గర బిడ్డ పక్కనే చిన్న రక్తపు గడ్డ ఏర్పడవచ్చు. అయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేదా గర్భస్రావం మాదిరిగా ఈ రెండు పరిస్థితులూ ప్రమాదకరమైనవి కావు. అయితే గర్భం దాల్చిన చివరి నెలల్లో ఇలాంటి స్పాటింగ్ గర్భస్రావాన్నీ, నెలలు నిండకుండా జరిగిపోయే ప్రసవాన్నీ సూచిస్తాయి. అలాగే ప్లాసెంటా ప్రీవియా అనే పరిస్థితి కారణంగా జరగబోయే తీవ్ర రక్తస్రావాన్ని కూడా ఇది సూచిస్తుంది. కాబట్టి గర్భిణుల్లో చుక్కలుగా రక్తస్రావం జరిగినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రతించి, గర్భస్రావాన్ని నివారించుకోవడం కోసం, గర్భంలో బిడ్డ పరిస్థితి, ప్లాసెంటా ఉన్న ప్రదేశాన్ని తెలుసుకోవడంతో పాటు, స్పెక్యులమ్‌ను కూడా పరీక్షించుకోవాలి.
డాక్టర్ శ్రుతి రెడ్డి పొద్దుటూరు,
కన్సల్టెంట్ అబ్‌స్టెట్రీషియన్,
గైనకాలజిస్ట్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్,
బర్త్‌రైట్ బై రెయిన్‌బో, హైదరాబాద్.
ఈ వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News