Vinegar Benefits For Cooking: వెనిగర్‌ను ఇందుకూ వాడొచ్చు
ABN , Publish Date - Aug 10 , 2025 | 05:00 AM
సలాడ్‌లు, కొన్ని రకాల వంటల్లో వెనిగర్‌ను వాడుతుంటాం. వెనిగర్‌ను వంట గదిలో ఇంకా చాలా రకాలుగా కూడా వాడొచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం..
సలాడ్‌లు, కొన్ని రకాల వంటల్లో వెనిగర్‌ను వాడుతుంటాం. వెనిగర్‌ను వంట గదిలో ఇంకా చాలా రకాలుగా కూడా వాడొచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం..
మాంసం ముక్కలకు కొంచెం వెనిగర్ రాస్తే అవి త్వరగా ఉడుకుతాయి. అలాగే మాంసం మీద ఉండే హానికర బ్యాక్టీరియాను కూడా వెనిగర్ తొలగిస్తుంది.
వంట గదిలోని వస్తువులను శుభ్రం చేయడంలోనూ వెనిగర్ బాగా పనిచేస్తుంది. చాపింగ్ బోర్డు, జిడ్డు అంటిన స్టీల్ వస్తువులను వెనిగర్ కలిపిన నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితముంటుంది.
మార్కెట్ నుంచి తెచ్చుకునే కూరగాయలు, ఆకుకూరలు, పళ్ల మీద క్రిమి సంహారక మందుల అవశేషాలు ఉంటాయి. ఎంత శుభ్రం చేసినా అవి వదిలిపోవు. అలాంటప్పుడు నీటిలో కొంచెం వెనిగర్ కలిపి శుభ్రం చేస్తే ఆ అవశేషాలు వదిలిపోతాయి.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి