Share News

Sleeping in Jeans: జీన్స్‌ వేసుకుని నిద్రిస్తున్నారా

ABN , Publish Date - Jul 16 , 2025 | 02:13 AM

సౌకర్యవంతంగా ఉంటుందనే భావనతో ఇప్పుడు ప్రతిఒక్కరూ జీన్స్‌ ధరిస్తున్నారు. పని ఒత్తిడి వల్ల అలసిపోయి ఇంటికి వచ్చి...

Sleeping in Jeans: జీన్స్‌ వేసుకుని నిద్రిస్తున్నారా

సౌకర్యవంతంగా ఉంటుందనే భావనతో ఇప్పుడు ప్రతిఒక్కరూ జీన్స్‌ ధరిస్తున్నారు. పని ఒత్తిడి వల్ల అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు, ప్రయాణాల్లో, బంధు మిత్రుల ఇళ్లకు వెళ్లినప్పుడు... ఇలా కొన్ని సందర్భాల్లో జీన్స్‌తోనే నిద్రపోవడం పరిపాటి అవుతోంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. జీన్స్‌ ధరించి నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు ఇవే...

  • సాధారణంగా జీన్స్‌ని డెనిమ్‌ వస్త్రంతో తయారు చేస్తారు. ఇది చెమటను త్వరగా పీల్చుకోలేదు. ఇలా గంటలపాటు జీన్స్‌ ధరించి ఉండడం వల్ల జననేంద్రియాల వద్ద చెమట కారణంగా ఇన్ఫెక్షన్‌ సోకవచ్చు. దురద, దద్దుర్లు, చర్మం ఎరుపెక్కడం లాంటి సమస్యలు ఏర్పడవచ్చు. అధికంగా చెమట పట్టే స్వభావం ఉన్నవారు జీన్స్‌ ఎక్కువగా ధరించకపోవడమే మంచిది.

  • గాఢంగా నిద్రపోతున్నప్పడు శరీర ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. కానీ జీన్స్‌ ధరించినప్పుడు శరీరానికి గాలి తగలక వేడిగా అనిపిస్తుంది. అధికంగా చెమటపట్టి అసౌకర్యంగా ఉంటుంది. దీనితో నిద్రాభంగం అవుతుంది. అందుకే ఇంటికి రాగానే డ్రెస్‌ మార్చుకోవడం అలవాటు చేసుకోవాలి.

  • జీన్స్‌ దుస్తులు బిగుతుగా ఉంటాయి. వాటిని ధరించినప్పుడు గర్భాశయం, పొత్తికడుపు, నడుము భాగాల మీద ఒత్తిడి పడుతుంది. రక్తప్రసరణ కూడా సరిగా జరగదు. దీంతో నడుంనొప్పి, కడుపు ఉబ్బరం, నెలసరి సమస్యలు వస్తాయి.

  • జీన్స్‌ దుస్తులు చర్మాన్ని పట్టి ఉంచుతాయి. దీనివల్ల నడుము, మోకాళ్ల దగ్గర చర్మం ఒరుసుకుపోయి వాపులు వస్తాయి.

  • జీన్స్‌ వేసుకుని పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ప్రభావితమవుతుంది. అజీర్తి, మలబద్దకం రావచ్చు.

  • కేవలం రాత్రిపూట మాత్రమే కాదు పగలు కూడా మరీ బిగుతుగా ఉండే జీన్స్‌ వేసుకోకూడదు. కాస్త వదులుగా ఉండేవి, కాటన్‌తో రూపొందించినవి ఎంపిక చేసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి..

శుభాంశు శుక్లా బృందాన్ని ఆసుపత్రికి తరలించిన నాసా..

భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 02:13 AM