Share News

Bollywood Baby Names: సింపుల్‌గా ఉన్నా ఎంతో స్పెషల్‌

ABN , Publish Date - Dec 08 , 2025 | 01:58 AM

బాలీవుడ్‌లో కొత్తతరం తారల సందడి మొదలైంది. తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న సెలబ్రిటీలు ఇప్పుడు తల్లిదండ్రులుగా కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో...

Bollywood Baby Names: సింపుల్‌గా ఉన్నా ఎంతో స్పెషల్‌

బాలీవుడ్‌లో కొత్తతరం తారల సందడి మొదలైంది. తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న సెలబ్రిటీలు ఇప్పుడు తల్లిదండ్రులుగా కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో తమ పిల్లలకు వారు పెడుతున్న పేర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పాతకాలంలా కాకుండా చాలా సింపుల్‌గా ఉంటూనే ఎంతో లోతైన, అందమైన అర్థాలున్న పేర్లను ఎంచుకుంటున్నారు. ఇటీవల కియారా అద్వానీ-సిద్ధార్థ్‌ మల్హోత్రా దంపతులు తమ ముద్దుల కుమార్తె పేరును ప్రకటించడంతో ఈ ఒరవడి మరోసారి చర్చనీయాంశమైంది.

  • సారాయా : కియారా-సిద్ధార్థ్‌ దంపతులు తమ కుమార్తెకు ‘సారాయా’ అని నామకరణం చేశారు. ఇది హిబ్రూ పదం ‘సారాయ్‌’ నుంచి వచ్చింది. దీనికి అర్థం ‘యువరాణి’ అని. ఈ పేరుకు తమదైన ప్రత్యేకతను జోడిస్తూ కియారా, సిద్ధార్థ్‌ స్పెల్లింగ్‌లో చిన్న మార్పు చేసి ‘సారాయా’గా మార్చారు.

  • దువా : దీపిక పదుకొణె-రణ్‌వీర్‌సింగ్‌ దంపతులు తమ కుమార్తెకు ‘దువా పదుకొణె సింగ్‌’ అని పేరు పెట్టారు. దువా అంటే ‘ప్రార్థన’ అని అర్థం. ‘మా ప్రార్థనకు సమాధానంగా తను వచ్చింది’ అంటూ వారు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో ఈ పేరును పంచుకున్నారు.

  • రహా : అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ కూతురి పేరు ‘రహా’. ఈ పేరుకు ఎన్నో అందమైన అర్థాలున్నాయి. స్వాహిలి భాషలో ‘ఆనందం’, సంస్కృతంలో ‘వంశం’, అరబిక్‌లో ‘శాంతి, స్వేచ్ఛ, సుఖం’ వంటి విభిన్న అర్థాలున్నాయి. ఈ పేరును వాళ్ల నాయనమ్మ ఎంచుకున్నారని అలియా చెప్పుకొచ్చారు.

  • లారా : వరుణ్‌ ధావన్‌-నటాషా దలాల్‌ జంట తమ కుమార్తెకు ‘లారా’ అని పేరు పెట్టారు. పలు సంస్కృతులలో దీనికి వేర్వేరు అర్థాలున్నాయి. లాటిన్‌లో ‘ఇంటిని, పొలాలను కాపాడే దేవత’ అని, గ్రీకు పురాణాల్లో ‘దేవతల దూత’ అని అర్థం. స్పానిష్‌లో ‘లారెల్‌ చెట్టు’ అనే అర్థం కూడా ఉంది. మొత్తంమీద నేటితరం బాలీవుడ్‌ తారలు తమ పిల్లల పేర్ల విషయంలో సంప్రదాయాన్ని, ఆధునికతను మేళవిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందమైన అర్థాలను అన్వేషిస్తూ కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని

సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్

For More AP News And Telugu News

Updated Date - Dec 08 , 2025 | 01:58 AM