Home Care : ఇల్లు శుభ్రంగా ఉండాలంటే...
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:26 AM
ఇల్లు అద్దంలా మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడమనేది నిరంతర ప్రక్రియ. ఇంట్లో గోడలు, తలుపులు, వస్తువులపై సాధారణంగా ఏర్పడే మరకలు ఇంటి అందాన్ని తగ్గిస్తుంటాయి. చిన్న చిట్కాలు పాటిస్తూ ఇంటిని ఆహ్లాదరకరంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం!

ఇల్లు అద్దంలా మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడమనేది నిరంతర ప్రక్రియ. ఇంట్లో గోడలు, తలుపులు, వస్తువులపై సాధారణంగా ఏర్పడే మరకలు ఇంటి అందాన్ని తగ్గిస్తుంటాయి. చిన్న చిట్కాలు పాటిస్తూ ఇంటిని ఆహ్లాదరకరంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం!
వంటగదిలో స్టీల్ సింక్‌పైన, కుళాయిల చుట్టూ తెల్లని నీటి మరకలు ఏర్పడుతుంటాయి. వీటిని ఎంత రుద్ది కడిగినా పోవు. అలాంటప్పుడు ఒక చెంచా ఆలివ్ నూనెకి అరచెంచా ఉప్పు కలిపి ఈ మిశ్రమాన్ని మరకల మీద రాయాలి. గంటసేపు ఆరినతరవాత వేడినీళ్లతో కడిగేస్తే మరకలన్నీ పోతాయి.
సాధారణంగా ఇంట్లో గోడలపై చిన్న పిల్లలు క్రేయాన్స్‌తో గీతలు గీస్తుంటారు. బొమ్మలు వేస్తుంటారు. వీటిని పోగొట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల గోడలు పాడైపోతుంటాయి. అలాకాకుండా హెయిర్ డ్రైయర్‌తో వేడిగాలిని మరకలకు తగిలేలా చేయాలి. తరవాత సబ్బునీళ్లలో ముంచిన గుడ్డతో తుడిచేస్తే క్రేయాన్స్ మరకలతోపాటు చేతి గుర్తులు, ఇతర జిడ్డు మరకలు కూడా పోతాయి.
ఓవెన్‌లో ఒక్కోసారి పదార్థాలు పడిపోతూ ఉంటాయి. లోపలి భాగం అంతా జిడ్డుగా మారుతుంది కూడా. అలాంటప్పుడు ఒక గిన్నెలో రెండు నిమ్మ చెక్కలు వేసి దాన్ని ఓవెన్‌లో పెట్టి అధిక ఉష్ణోగ్రత సెట్ చేసి అయిదు నిమిషాలు ఉంచాలి. తరవాత ఓ తడిగుడ్డతో లోపల తుడిచేస్తే చాలు. అలాగే... ఓవెన్ తలుపు మీద కూడా చేతి గుర్తులు, ఇతర మరకలు ఏర్పడుతుంటాయి. ఒక చెంచా బేకింగ్ సోడాకు అర చెంచా నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని తలుపు మీద రాసి అరగంట తరవాత పొడిగుడ్డతో తుడిచేస్తే మరకలన్నీ పోయి ఓవెన్ తలుపు తళతళలాడుతుంది.
వంట పూర్తయిన వెంటనే స్టవ్‌ను కాగితం లేదా పలుచని గుడ్డతో తుడిచేయాలి. దీనివల్ల స్టవ్ పరిశుభ్రంగా ఉండడమే కాకుండా ఎక్కువకాలం మన్నుతుంది. స్టవ్‌ను ఉంచిన గట్టును రెండు రోజులకోసారి సబ్బునీళ్లతో శుభ్రం చేయాలి.
వాష్‌బేసిన్‌పై కూడా రకరకాల మరకలు ఏర్పడుతుంటాయి. వీటిపై టూత్‌పే్‌స్ట రాసి అరగంట తరవాత నీళ్లతో తడిపిన స్పాంజ్‌తో తుడిచేస్తే చాలు.
డ్రెస్సింగ్ మిర్రర్, కిటికీల అద్దాలను తరచూ కాగితంతో తుడవడం వల్ల అవి మెరుస్తుంటాయి. టీవీ స్ర్కీన్, ఫ్రిజ్, సోఫాలను రోజుకు ఒకసారి పొడి గుడ్డతో తుడవాలి.
ఇంట్లో ఉండే ఫ్యాన్‌లు, కిటికీలు, తలుపులను వారానికి ఒకసారి సబ్బునీళ్లతో శుభ్రం చేయాలి.
బూజు, దుమ్ము, ధూళి లేకుండా ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
Also Read: ఆప్‌కి మద్దతుగా అఖిలేష్ ఎన్నికల ప్రచారం
Also Read: నీ ఇంట్లో నుంచి అవార్డు ఇస్తున్నావా సంజయ్..!
Also Read:ఆర్చర్ జ్యోతి సురేఖకు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి
Also Read: అమెరికాలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించిన వక్తలు