Share News

Knees Lightening: మోచేయి నలుపు పోవాలంటే

ABN , Publish Date - Aug 07 , 2025 | 01:45 AM

అందంగా ఉండాలని అమ్మాయిలు ఎన్నో చేస్తారు. అయితే ఎక్కువగా ముఖం మీద మాత్రమే శ్రద్ధ పెడతారు. దాంతో మోచేతులు, మోకాళ్లు, మడమలు వద్ద చర్మం నల్లగా మారుతుంది. ఈ నల్లదనాన్ని ఎలా పోగొట్టుకోవాలో...

Knees Lightening: మోచేయి నలుపు పోవాలంటే

అందంగా ఉండాలని అమ్మాయిలు ఎన్నో చేస్తారు. అయితే ఎక్కువగా ముఖం మీద మాత్రమే శ్రద్ధ పెడతారు. దాంతో మోచేతులు, మోకాళ్లు, మడమలు వద్ద చర్మం నల్లగా మారుతుంది. ఈ నల్లదనాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం..

  • కలబందతో ఈ నలుపును వదిలించవచ్చు. కలబందు గుజ్జును మోచేతులు, మోకాళ్లు, మడమలు మీద రాయాలి. ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది.

  • ఒక చెంచా ఆలివ్‌ నూనెలో కొంచె పంచదార వేసి కలిపి. ఈ మిశ్రమాన్ని నల్లగా మారినా చర్మం మీద రాసి మర్ధన చేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పంచదార స్క్రబ్‌ల పనిచేసి మృతకణాలను తొలగిసస్తుంది. క్రమంగా నలుపు తగ్గిపోతుంది.

  • కొబ్బరి నూనె కూడా ఈ నలుపును తగ్గిస్తుంది. రోజూ మోచేతులు, మోకాళ్లు, మడమలకు కొబ్బరి నూనె కొంచెంసేపు మర్ధన చేయాలి. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కూడా కలపవచ్చు. ఇలా చేసిన మంచి ఫలితముంటుంది.

  • నిమ్మకాయ సహజ బ్లీచింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్‌ సి చర్మం మీద ఉన్న మృత కణాలను తొలగించడంలో సమర్థంగా పనిచేస్తుంది. నిమ్మకాయ ముక్కలను మోచేతులు, మోకాళ్ల మీద రుద్దితే మంచి ఫలితముంటుంది.

  • పెరుగులోని లాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. మోచేతులు, మోకాళ్ల మీద పెరుగు రాసి 15 నుంచి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేసి తరువాత కొబ్బరి నూనెతో మర్ధన చేయాలి. రోజూ ఇలా చేస్తే క్రమంగా చర్మం నలుపు మాయమవుతుంది.

  • బంగాళాదుంప ముక్కను మోకాళ్లు, మోచేతుల మీద 5 నిమిషాల పాటు రుద్దాలి. తరువాత నీటితో శుభ్రం చేయాలి. తరచూ ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో స్తతా చాటిన కూటమి

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

మరిన్నీ తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 07 , 2025 | 01:45 AM