అతిగా తాగితే
ABN , Publish Date - Jun 19 , 2025 | 01:47 AM
కొందరికి ఉదయం, సాయంత్రం టీ లేదా కాఫీ తాగడం అలవాటు. అయితే వర్షాకాలంలో వాతావరణం మారి చిరుజల్లులు మొదలవగానే సమయంతో సంబంధం లేకుండా టీ తాగుతుంటారు....
కొందరికి ఉదయం, సాయంత్రం టీ లేదా కాఫీ తాగడం అలవాటు. అయితే వర్షాకాలంలో వాతావరణం మారి చిరుజల్లులు మొదలవగానే సమయంతో సంబంధం లేకుండా టీ తాగుతుంటారు. ఇలా అతిగా టీ, కాఫీలు తీసుకోవడం వలన పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
టీ, కాఫీల్లో కెఫిన్ ఉంటుంది. ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో గుండెలో మంట వచ్చే ప్రమాదముంది.
కడుపు ఉబ్బరం, ఎసిడిటి సమస్యలు కూడా వస్తాయి.
టీ, కాఫీలు అతిగా తాగడం వలన శరీరంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. ఫలితంగాడయాబెటిస్, ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
టీ, కాఫీ వలన కొలెస్ట్రాల్ పేరుకుపోయి, గుండె సంబంధిత వ్యాధులకు దారితీయవచ్చు.
కెఫిన్ మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో నిద్ర సరిగా పట్టదు.
టీ, కాఫీల్లో ఉండే సుక్రోజ్ కాలేయం, చిన్న ప్రేగు మీద చెడు ప్రభావం చూపుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హీరో ఫిన్‌కార్ప్ రూ 260 కోట్ల సమీకరణ
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News