Share News

షైనింగ్‌ కెరీర్‌ ఫుట్‌వేర్‌ డిజైనింగ్‌

ABN , Publish Date - Feb 17 , 2025 | 03:55 AM

ఒక వ్యక్తి ఆహార్యాన్ని ఉన్నతంగా రూపొందించడంలో మేకప్‌, దుస్తులతో సమాన ప్రాధాన్యం పాదరక్షలది కూడా. ఆకట్టుకునే బట్టలు కట్టుకున్న వ్యక్తి ఆకు చెప్పులతో తిరిగితే ఎబ్బెట్టుగా ఉంటుంది...

షైనింగ్‌ కెరీర్‌ ఫుట్‌వేర్‌ డిజైనింగ్‌

ఒక వ్యక్తి ఆహార్యాన్ని ఉన్నతంగా రూపొందించడంలో మేకప్‌, దుస్తులతో సమాన ప్రాధాన్యం పాదరక్షలది కూడా. ఆకట్టుకునే బట్టలు కట్టుకున్న వ్యక్తి ఆకు చెప్పులతో తిరిగితే ఎబ్బెట్టుగా ఉంటుంది. సమయానికి అనుగుణమైన పాదరక్షలు ధరిస్తే సౌకర్యవంతంగా, హుందాగా ఉంటుంది. పాదరక్షల తయారీ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. అందుకే భారతదేశంలో ప్రధాన రంగాల్లో లెదర్‌ ఇండస్ట్రీ ఒకటిగా ఎదిగింది. దేశ జాతీయ ఉత్పత్తిలో రెండు శాతం వాటా ఉన్న ఈ రంగం, దాదాపు 44 లక్షల మందిపైగా ఉద్యోగాలు కల్పిస్తోంది. లెదర్‌ ఇండస్ట్రీని మార్కెట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ‘ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవెల్‌పమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌’(ఎ్‌ఫడీడీఐ)లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.


ఇంజనీరింగ్‌ చదువులకు ఐఐటీ, మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఐఐఎమ్‌, దుస్తుల ఫ్యాషన్‌కు నిఫ్ట్‌ ఎలాగో ఫుట్‌వేర్‌ చదువులకు ఎఫ్‌డీడీఐ అలాంటిది. దేశ వ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా నోయిడా, కోల్‌కొతా, రోహ్‌తక్‌, రాయ్‌బరేలీ, జోధ్‌పూర్‌, చెన్నై, చింద్వారా, చంఢీగడ్‌, గుణ, అంకలేశ్వర్‌, పట్నల్లో 12 ఎఫ్‌డీడీఐ క్యాంప్‌సలు ఉన్నాయి. వీటిలో 2025-26 అకడమిక్‌ సంవత్సరం యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఆల్‌ఇండియా సెలెక్షన్‌ టెస్ట్‌-2025 (ఏఐఎస్‌టీ-2025) ఆధారంగా ఎంపిక జరుగుతుంది.


బ్యాచిలర్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు:

1. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడీఎ్‌స): నాలుగు సంవత్సరాల కోర్సు ఇది. ఇందులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి.

  • బీడీఈఎ్‌స(ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌)

  • బీడీఈఎ్‌స(ఫ్యాషన్‌ డిజైన్‌)

  • బీడీఈఎ్‌స(లెదర్‌, లైఫ్‌ స్టయిల్‌ అండ్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌)

2. బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(బీబీఏ): నాలుగు సంవత్సరాల కోర్సు ఇది. ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి.

  • బీబీఏ(రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చండైజ్‌)

మాస్టర్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌లు

1. మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎండీఎ్‌స): రెండు సంవత్సరాల కోర్సు ఇది. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి.

  • ఎండీఈఎ్‌స(ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌)

  • ఎండీఈఎ్‌స(ఫ్యాషన్‌ డిజైన్‌)

2. మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ): ఎంబీఏ(రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మర్చండైజ్‌)

అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులకు ఇంటర్‌మీడియేట్‌, మాస్టర్‌ డిగ్రీ కోర్సులకు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.

వయస్సు: బ్యాచిలర్‌ డిగ్రీలో చేరాలనుకునే వారి వయస్సు 25 సంవత్సరాలలోపు ఉండాలి. పీజీ కోర్సులకు వయోపరిమితి లేదు.

చివరి తేదీ: ఏప్రిల్‌ 20 ఎంట్రెన్స్‌ తేదీ: మే 11

ఫలితాలు: 2025 జూన్‌ మొత్తం సీట్లు: 2390

వెబ్‌సైట్‌: https://fddiindia.com/


ఇవి కూడా చదవండి..

గోల్డ్‌ బాండ్లకు గుడ్‌బై..

ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!

గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు

మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 17 , 2025 | 03:55 AM