Share News

Wedding Saree Styles: కళ్లు చెదిరే కాంతల్లా

ABN , Publish Date - Sep 03 , 2025 | 02:30 AM

వేడుకల్లో వెలిగిపోయేలా బంగారు, వెండి జరీ ధగధగలు, కలనేతల కళాకాంతులు సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం పలు రకాల పట్టు చీరలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిలో కొన్నిటి మీద...

Wedding Saree Styles: కళ్లు చెదిరే కాంతల్లా

ఫ్యాషన్‌

వేడుకల్లో వెలిగిపోయేలా బంగారు, వెండి జరీ ధగధగలు, కలనేతల కళాకాంతులు సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం పలు రకాల పట్టు చీరలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిలో కొన్నిటి మీద ఓ లుక్కేద్దామా?

  • చామంతులు, కనకాంబరాలు కలిపి కట్టిన పూమాలలా కనిపించాలంటే పవిట చెంగు, కుచ్చిళ్లు ఒక రంగు లో, చీర మొత్తం మరో రంగులో ఉండాలి. అలాంటి కాంట్రాస్ట్‌ రంగుల్లోనే చీర భారీగా కనిపించి కనువిందు చేస్తుంది.

  • తెల్ల పట్టుచీర హూందాతనమే వేరు. ప్రింటెడ్‌ డిజైన్‌ మోడర్న్‌ లుక్‌ని తెచ్చిపెడితే, కాంట్రాస్ట్‌ జరీ బార్డరు చీర మొత్తానికే వన్నె తెస్తుంది.

  • వెండి వెలుగులు విరజిమ్మాలంటే వెండి జరీలో ధగధగలాడాలి. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే వెండి జరీ చీరను ఎంచుకుంటే సరి!

  • కుచ్చిళ్ల దగ్గర జరీ బార్డరు మోకాళ్ల వరకూ ఉండడం తాజా ఫ్యాషన్‌! ఈ స్టయిల్‌ చీరకు వినూత్న ఆకర్షణను తెచ్చిపెడుతుంది. జరీ మీద కనిపించీ, కనిపించకుండా ఉండే సెల్ఫ్‌ డిజైన్‌ చీరకే వన్నె తెస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసులపై కాల్పులు.. రేప్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పరార్..

సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర

For More National News

Updated Date - Sep 03 , 2025 | 02:30 AM