Brain Exercises: మెదడుకు పదును ఇలా
ABN , Publish Date - Sep 02 , 2025 | 03:57 AM
మెదడు చురుగ్గా ఉంచుకున్నంత కాలం, మతిమరుపు సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వాళ్లు మెదడుకు వ్యాయామాన్ని అందిస్తూనే ఉండాలి. అందుకోసం...
మెదడు చురుగ్గా ఉంచుకున్నంత కాలం, మతిమరుపు సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వాళ్లు మెదడుకు వ్యాయామాన్ని అందిస్తూనే ఉండాలి. అందుకోసం....
రోజుకొక కొత్త విషయం: కొత్త సమాచారంతో మెదడుకు సవాలు విసురుతూ మెదడును చురుగ్గా ఉంచుకుంటూ ఉండాలి. కొత్త అభిరుచి ఏర్పరుచుకోవడం, కొత్త భాష నేర్చుకోవడం, కొత్త సంగీత వాయిద్యం సాధన చేయడం లాంటివన్నీ మెదడుకు వ్యాయామాలే! ఇవన్నీ చేయలేనివాళ్లు కొత్త వంటకం వండడం, కొత్త విషయాలను తెలుసుకోవడం లాంటివి చేయొచ్చు.
బ్రెయిన్ గేమ్స్, పజిల్స్: సుడొకు, పజిల్స్ పూరిస్తూ వాటిని నిరంతరం సాధన చేస్తూ ఉండాలి. ఈ ఆటల కోసం రోజుకు అరగంట కేటాయించడం వల్ల మెదడు చురుకుదనం పెరుగుతుంది. అయితే రోజూ ఒకే రకమైన బ్రెయిన్ గేమ్స్‌కు బదులుగా ఒక రోజు సుడొకు, ఒక రోజు పదవినోదం, మరొక రోజు అంకెల గారడీ లాంటివి ఆడుతూ ఉండాలి.
ధ్యానం: ధ్యానంతో మానసిక ప్రశాంతత దక్కడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. క్రమం తప్పక ధ్యానం చేయడం వల్ల జ్ఞాపకశక్తితో సంబంధమున్న మెదడులోని హిప్పొపొటమస్ అనే ప్రదేశం బలపడుతుంది.
వ్యాయామం: వ్యాయామంతో మెదడు కూడా లాభపడుతుంది. ఏరోబిక్ వ్యాయామంతో మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. నడక, ఈత, డాన్స్... ఇవన్నీ మెదడును చురుగ్గా ఉంచుతాయి. కాబట్టి రోజుకు కనీసం 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి.
అనుబంధాలు: సంభాషణ, హాస్యం, అనుబంధాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి స్నేహితులతో కాలక్షేపం చేయడం, కలిసి సినిమాలు చూడడం, చర్చలు జరపడం లాంటివి చేస్తూ ఉండాలి. సామాజిక సంబంధాలను పెంపొందించుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
హరీష్ రావును టార్గెట్ చేసింది అందుకేనా..?
For More AP News And Telugu News