Share News

Sharannavaratri 2025: నేటి అలంకారం శ్రీ శ్రీ గాయత్రీ దేవి

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:00 AM

శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండో రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రీ మంత్రంలో అనుబంధం ఉంది. అందుకే...

Sharannavaratri 2025: నేటి అలంకారం శ్రీ  శ్రీ గాయత్రీ దేవి

దుర్గా నవరాత్రులు

ఆశ్వయుజ శుద్ధ విదియ, మంగళవారం

శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండో రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రీ మంత్రంలో అనుబంధం ఉంది. అందుకే ఆయా దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి ‘రుద్రగాయత్రి’, ‘లక్ష్మీగాయత్రి’, ‘విష్ణుగాయత్రి’ అని గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు నివేదన చేస్తారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టానదేవత. ఆ తల్లి అధిష్టాన దేవత సూర్యభగవానుడు. కాబట్టి గాయత్రీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సూర్యుడు అనుగ్రహంతో ఆరోగ్యం లభిస్తుందని నమ్మిక. ప్రాతఃకాలంలో గాయత్రి గాను, మధ్యాహ్న కాలంలో సావిత్రి గాను, సాయంసంధ్యలో సరస్వతి గాను ఆమె భక్తుల పూజలు అందుకుంటుంది. గాయత్రీ ఉపాసనతో బుద్ధి తేజోవంతం అవుతుందనీ, గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్నిస్తుందనీ పురాణాలు చెబుతున్నాయి. వరదాభయహస్తాలతో సకల వేద స్వరూపమైన గాయత్రీదేవిని ఆదిశంకరులు అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ దుర్గమ్మను ధ్యానిస్తే సకల మంత్ర సిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని, పూజించిన వారికి సద్భుద్ధులు కలుగుతాయని,. పాపాలు నశిస్తాయని, అజ్ఞానం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి.

నైవేద్యం : అల్లం గారెలు, ఐదురకాల పిండివంటలు

అలంకరించే చీర రంగు : తెలుపు

పారాయణ: : గాయత్రీ మంత్రం

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 23 , 2025 | 05:00 AM