Seeds and Their Health Benefits: విత్తనాలు ఉపయోగాలు
ABN , Publish Date - Sep 23 , 2025 | 02:38 AM
విత్తనాలు పోషకభాండాగారాలు. ఎన్నో విలువైన పోషకాలు విత్తనాల్లో ఉంటాయి. కాబట్టి వాటిని ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి. ఏ విత్తనాల్లో ఏఏ పోషకాలుంటాయో, వాటితో ఎలాంటి ప్రయోజనాలను....
తెలుసుకుందాం
విత్తనాలు పోషకభాండాగారాలు. ఎన్నో విలువైన పోషకాలు విత్తనాల్లో ఉంటాయి. కాబట్టి వాటిని ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి. ఏ విత్తనాల్లో ఏఏ పోషకాలుంటాయో, వాటితో ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకుందాం!
గుమ్మడి: వంద గ్రాముల గుమ్మడి విత్తనాల్లో... ప్రొటీన్ 24.54 గ్రాములు, పిండిపదార్థాలు 17.81 గ్రాములు, కొవ్వులు 45.85 గ్రాములు, 541 కిలో క్యాలరీలు ఉంటాయి. వీటితో నిద్ర మెరుగుపడుతుంది. వీటితో దొరికే జింక్‌తో క్యాన్సర్ నుంచి రక్షణ దక్కుతుంది.
చియా: వీటిలో ప్రొటీన్ 17 గ్రాములు, పిండిపదార్థాలు 42 గ్రాములు, కొవ్వులు 31 గ్రాములు, 486 కిలోక్యాలరీలు ఉంటాయి. వీటితో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. వీటిలోని పుష్కలమైన ఒమేగా3 యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్‌తో ఇన్‌ఫ్లమేషన్ అదుపులోకొస్తుంది
అవిసె: వీటిలో ప్రొటీన్ 18 గ్రాములు, పిండిపదార్థాలు 29 గ్రాములు, కొవ్వులు 42 గ్రాములు, 534 కిలో క్యాలరీలు ఉంటాయి. వీటితో మలబద్ధకం వదులుతుంది. హార్మోన్ల హెచ్చుతగ్గులు అదుపులోకొస్తాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.
పొద్దుతిరుగుడు: వీటిలో ప్రొటీన్ 21 గ్రాములు, పిండిపదార్థాలు 20 గ్రాములు, కొవ్వులు 51 గ్రాములు, 584 కిలోక్యాలరీలు ఉంటాయి. గుండె పనితీరు మెరుగుపడుతుంది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News