Share News

Saint Luke The Evangelist: విమోచనే లక్ష్యంగా

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:40 AM

సువార్తికుడైన సెయింట్‌ లూకా పూర్తిపేరు లూకానుస్‌. అతను యూదా మతానికి సంబంధం లేని ఒక గ్రీకు కుటుంబీకుడు. ప్రాచీన సిరియాలోని ఆంటియోచ్‌కు చెందిన వ్యక్తి. అతనిది వైద్య వృత్తి అని చెబుతారు. ‘లూకా’ అంటే ఇటలీ దేశంలోని లూకానియా...

Saint Luke The Evangelist: విమోచనే లక్ష్యంగా

దైవమార్గం

సువార్తికుడైన సెయింట్‌ లూకా పూర్తిపేరు లూకానుస్‌. అతను యూదా మతానికి సంబంధం లేని ఒక గ్రీకు కుటుంబీకుడు. ప్రాచీన సిరియాలోని ఆంటియోచ్‌కు చెందిన వ్యక్తి. అతనిది వైద్య వృత్తి అని చెబుతారు. ‘లూకా’ అంటే ఇటలీ దేశంలోని లూకానియా ప్రాంతానికి చెందిన పేరు. ఆ పదానికి ‘కాంతి’ అనే అర్థం కూడా ఉంది లూకా పేరు... లాటిన్‌లో ‘లూకాస్‌’ అని వినిపిస్తూ ఉంటుంది. అరుణోదయంలో పుట్టినవారిని ‘లూసియాస్‌’ అంటారట. ఏ విధంగా చూసినా... ఆ పేరుకు ప్రకాశం అనే అర్థం స్థిరంగా కనిపిస్తోంది.

లూకా... క్రీస్తు జీవన రేఖలను చిత్రించిన మహా రచయిత. అంతేకాదు, అపోస్తుల (అపోస్తలుల) కార్యాలన్నిటినీ సుస్పష్టంగా రాశాడు. నూతన నిబంధనలోని రెండు ప్రధాన గ్రంథాలకు (లూకా సుపార్త, అపోస్తుల కార్యాలు) కర్తృత్వం వహించడం అంటే మాటలు కాదు. ‘లూకా సువార’్త 24 అధ్యాయాల గ్రంథం. ‘అపోస్తుల కార్యాలు’ 28 అధ్యాయాలు కలిగిన గ్రంథం. ఒక గ్రంథాన్ని రాయడం వేరు, ఎక్కడా ఏ విధమైన భావ వైరుధ్యం లేకుండా రాయడం వేరు. లూకా గ్రంథంలో మానవ విమోచనే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. యూదేతరులను, తరతరాల అబ్రహమీయులను, పేదలను, మహిళలను లూకా ప్రత్యేక కోణంలో చూపించాడు. క్రీస్తును తండ్రి (దేవుడి) మాటను నెరవేర్చే వ్యక్తిగా ప్రదర్శించాడు. ప్రార్థనా సంస్కృతిని, దాని గొప్పతనాన్ని చిత్రీకరించాడు. మిగతా సౌవార్తికుల మాదిరిగానే ఉపమానాలతో నిండిన కథలను ప్రకటించాడు. క్రీస్తు చేసిన 26 అద్భుతాలను లూకా పేర్కొన్నాడు. దెయ్యాలను వెళ్ళగొట్టడం నుంచి, రోగులను స్వస్థత పరచడం వరకూ, అలాగే ఏసు స్వీయమైన దివ్య శక్తుల నుంచి దైవ మహిమను నిరూపించడం కోసం ప్రకటించిన విశేషాల వరకూ అన్నిటినీ వివరించాడు. ఈ 26 ఉపమాన కథల ద్వారా ఆయన సందేశాన్ని సుగమం చేశాడు. లూకా చిహ్నం వృషభం.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024

ఇవి కూడా చదవండి

నిఖత్‌కు నిరాశ క్వార్టర్స్‌లో ఓటమి

అమ్మాయిలు అదే జోరు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 12 , 2025 | 05:40 AM