Noor Inayat Khan: స్వేచ్ఛా దీపం
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:02 AM
అవి రెండో ప్రపంచ యుద్ధపు చీకటి రోజులు. నాటి సైన్యం ఆక్రమించిన పారి్‌సలోని ఓ రహస్య గదిలో ఒక యువతి వేళ్లు వైర్‌లెస్ సెట్‌పై వేగంగా కదులుతున్నాయి. బయట సైనికుల కవాతు...
అవి రెండో ప్రపంచ యుద్ధపు చీకటి రోజులు. నాటి సైన్యం ఆక్రమించిన పారి్‌సలోని ఓ రహస్య గదిలో ఒక యువతి వేళ్లు వైర్‌లెస్ సెట్‌పై వేగంగా కదులుతున్నాయి. బయట సైనికుల కవాతు చప్పుళ్లు మృత్యుఘోషలా వినిపిస్తున్నాయి. టక్‌టక్ మంటూ ఆమె పంపే మోర్స్‌కోడ్ సందేశాలు మిత్రపక్షాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. ఆ పంపుతున్నది మరెవరో కాదు.. నూర్ ఇనాయత్‌ఖాన్. టిప్పు సుల్తాన్ వంశానికి చెందిన భారత సంతతి యువరాణి ఆమె. లండన్, పారి్‌సలలో కవిత్వం, సంగీతం మధ్య పెరిగిన ఆమె జీవితాన్ని నాజీల దురాక్రమణ పూర్తిగా మార్చేసింది. స్వేచ్ఛ కోసం పోరాడాలని నిర్ణయించుకున్న ఆమె బ్రిటన్ గూఢచార సంస్థ స్పెషల్ ఆపరేషన్స్‌లో చేరారు. అత్యంత ప్రమాదకరమైన మిషన్‌పై అధికారులు ఆమెను ఆక్రమిత ఫ్రాన్స్‌కు పంపారు. అలా ఫ్రాన్స్ చేరుకున్న మొట్టమొదటి మహిళా రేడియో ఆపరేటర్‌గా చరిత్ర సృష్టించారు. ప్రాణాలను పణంగా పెట్టి కీలక సమాచారాన్ని చేరవేస్తున్న ఆమె ఓ ద్రోహి కారణంగా నాజీ రహస్య పోలీసులకు చిక్కారు. అత్యంత పాశవికంగా హింసించినా ఆమె ఒక్క రహస్యం కూడా బయటపెట్టలేదు. చివరికి 1944 సెప్టెంబర్ 13న డకావ్ కాన్సంట్రేషన్ క్యాంపులో ఆమెను కాల్చి చంపారు. తుదిశ్వాస విడుస్తూ ఆమె గొంతెత్తి అరిచిన చివరి మాట ‘లిబర్టే’ (స్వేచ్ఛ). ఆమె త్యాగానికి గుర్తుగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఇటీవల ఆమె చిత్రంతో పోస్టేజ్ స్టాంపును విడుదల చేసి అరుదైన గౌరవాన్ని అందించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీతాఫలం నుంచి గింజలను సింపుల్‌గా ఇలా వేరు చేయవచ్చు..
మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు
Read Latest AP News and National News