Share News

Home Fragrance Tips: ఇల్లంతా సువాసన నిండేలా

ABN , Publish Date - Dec 17 , 2025 | 01:10 AM

ఇల్లు తుడిచే నీటిలో సువాసనభరితమైన లిక్విడ్‌ క్లీనర్స్‌ను కలుపుతూంటాం. వీటిలో ఉండే రసాయనాలవల్ల నేలమీద ఆడుకునే పిల్లలకు రకరకాల చర్మ సమస్యలు...

Home Fragrance Tips: ఇల్లంతా సువాసన నిండేలా

ఇల్లు తుడిచే నీటిలో సువాసనభరితమైన లిక్విడ్‌ క్లీనర్స్‌ను కలుపుతూంటాం. వీటిలో ఉండే రసాయనాలవల్ల నేలమీద ఆడుకునే పిల్లలకు రకరకాల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాకాకుండా నీటిలో వేటిని కలిపితే ఇల్లు శుభ్రంగా సువాసనల తో నిండుతుందో చూద్దాం.

  • రెండు నిమ్మకాయలను కోసి వాటి రసాన్ని బకెట్‌ నీటిలో కలపాలి. ఈ నీటిని ఇల్లంతా చల్లి గుడ్డతో తుడవాలి. దీంతో ఇల్లు తాజాగా అహ్లాదకరంగా మారు తుంది. ఈగలు, దోమలు బయటికి వెళ్లిపోతాయి.

  • ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా వైట్‌ వెనిగర్‌ లేదా ఒక చెంచా బేకింగ్‌ సోడా వేసి కలపాలి. ఈ నీటిలో మాప్‌ను ముంచి ఇల్లంతా తుడిస్తే తాజాగా అనిపిస్తుంది. మరకలు, మురికి వదిలిపోయి ఫ్లోర్‌ చక్కగా మెరుస్తుంది.

  • చెంచా లావెండర్‌ లేదా యూకలిప్టస్‌ ఆయిల్‌ను తీసుకుని బకెట్‌ నీటిలో వేసి బాగా కలపాలి.

  • ఈ నీటిలో మాప్‌ను ముంచి తుడిస్తే ఇల్లంతా సువాసన వెదజల్లుతుంది. ఇంట్లోకి పురుగులు, దోమలు, ఈగలు రావు.

ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!

తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్

For More AP News And Telugu News

Updated Date - Dec 17 , 2025 | 01:10 AM