Share News

Natural Fruit Face Packs: అందాన్ని పెంచే ఫేస్‌ప్యాక్‌లు

ABN , Publish Date - Oct 29 , 2025 | 05:20 AM

ముఖం అందంగా కనిపించాలని అమ్మాయిలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఖరీదైన క్రీమ్‌లు, సీరమ్‌లు ఉపయోగిస్తూ ఉంటారు. అలాకాకుండా అందుబాటులో ఉండే పండ్లతో ఫేస్‌ప్యాక్‌లు తయారుచేసుకుని...

Natural Fruit Face Packs: అందాన్ని పెంచే ఫేస్‌ప్యాక్‌లు

ముఖం అందంగా కనిపించాలని అమ్మాయిలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఖరీదైన క్రీమ్‌లు, సీరమ్‌లు ఉపయోగిస్తూ ఉంటారు. అలాకాకుండా అందుబాటులో ఉండే పండ్లతో ఫేస్‌ప్యాక్‌లు తయారుచేసుకుని వాడితే ముఖం మరింత అందంగా మారుతుంది. ఆ వివరాలు...

  • ఒక గిన్నెలో నాలుగు చెంచాల ద్రాక్షరసం, అరచెంచా బాదం పొడి, రెండు చెంచాల పాలు, అరచెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటసేపు ఆరనివ్వాలి. ఆపైన గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మెరుస్తుంది.

  • ఒక యాపిల్‌ను తీసుకుని ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. అందులో అరచెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావు గంట తరువాత మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే చర్మం మీద పేరుకున్న మృతకణాలు తొలగిపోతాయి. చర్మరంధ్రాలు శుభ్రమవుతాయి. ముఖం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. యాపిల్‌కు బదులు అరటిపండు లేదా అవకాడోను కూడా వాడుకోవచ్చు.

  • గుప్పెడు దానిమ్మ గింజలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. అందులో రెండు చెంచాల పెరుగువేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట తరువాత మంచినీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • ఒక గిన్నెలో పావు కప్పు నారింజ రసం, ఒక చెంచా పసుపు, ఒక చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి పట్టించి ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుంటే చర్మం తేమతో నిండి ముఖం నిగారిస్తుంది.

  • చిన్న గిన్నెలో అరకప్పు బొప్పాయి గుజ్జు, కోడిగుడ్డు తెల్లసొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంటసేపు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖం మీద నల్లమచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. చర్మం బిగుతుగా మారుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 05:20 AM