Stomach Cleansing Foods: వీటితో పొట్ట క్లీన్
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:51 AM
పొట్ట శుభ్రంగా ఉన్నప్పుడే జీవక్రియలు సజావుగా జరుగుతాయి. లేదంటే కడుపు ఉబ్బరించడం, ఎసిడిటీ, అజీర్తి, మలబద్దకం లాంటి సమస్యలతోపాటు పలు అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి....
పొట్ట శుభ్రంగా ఉన్నప్పుడే జీవక్రియలు సజావుగా జరుగుతాయి. లేదంటే కడుపు ఉబ్బరించడం, ఎసిడిటీ, అజీర్తి, మలబద్దకం లాంటి సమస్యలతోపాటు పలు అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి. ఏ పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటే పొట్ట సహజ రీతిలో శుభ్రపడుతుందో తెలుసుకుందాం...
రాత్రి పడుకునేముందు కొద్దిగా ఉసిరి రసం తాగితే జీర్ణాశయ వ్యవస్థ వేగంగా పనిచేస్తుంది. ఉదయానికల్లా పొట్టలోని మలినాలన్నీ పూర్తిగా విసర్జితమవుతాయి.
ఉదయాన్నే అల్లం టీ లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల అల్లం రసం కలుపుకుని తాగితే జీర్ణ సమస్యలన్నీ తొలగిపోతాయి. పేగులు పూర్తిగా శుభ్రపడతాయి. కడుపులో తేలికగా ఉన్న భావన కలుగుతుంది.
ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా వాము వేసి బాగా మరిగించి రాత్రి పడుకునేముందు తాగితే ఉదయానికల్లా కడుపులో పేరుకున్న వ్యర్థాలన్నీ విసర్జితమవుతాయి. వాములో ఉండే పీచు పదార్థాలు పొట్టని, పేగులను శుభ్రం చేస్తాయి.
ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మరసం కలుపుకుని తాగినా పొట్ట శుభ్రమవుతుంది.
తాజా కూరగాయలు, పండ్లు, శనగలు, ఓట్స్‌ను తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
మజ్జిగలో ప్రో బయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలను వృద్ధి పరుస్తాయి. తరచూ పలుచని మజ్జిగ తాగడం వల్ల పొట్టలో పేరుకున్న మలినాలన్నీ తొలగిపోతాయి.
తరచూ జీలకర్ర నీటిని తాగుతూ ఉంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జీలకర్రలోని యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు మలబద్దకాన్ని నివారిస్తాయి. దీనివల్ల ఎప్పటికప్పుడు పొట్ట శుభ్రపడుతుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీళ్లలో అరచెంచా త్రిఫల చూర్ణాన్ని కలుపుకుని తాగితే పొట్టలోని మలినాలు, టాక్సిన్లు తేలికగా తొలగిపోతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని
సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్
For More AP News And Telugu News