Milestone Colors: మైలురాయి రంగుల మర్మం ఇదే
ABN , Publish Date - Aug 25 , 2025 | 05:13 AM
మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, బస్సు లేదా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు రకరకాల రంగుల్లో ఉన్న మైలురాళ్లను చూస్తూ ఉంటాం. మైలురాయి కింది భాగంలో తెలుపు రంగు ఉంటుంది. దీనిమీద నిర్ణీత నగరానికి...
మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, బస్సు లేదా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు రకరకాల రంగుల్లో ఉన్న మైలురాళ్లను చూస్తూ ఉంటాం. మైలురాయి కింది భాగంలో తెలుపు రంగు ఉంటుంది. దీనిమీద నిర్ణీత నగరానికి లేదా గ్రామానికి ఉన్న దూరం.. కిలోమీటర్లలో రాసి ఉంటుంది. పై భాగంలో పసుపు, ఆకుపచ్చ, నీలం, కాషాయం రంగుల్లో ఒకటి ఉంటుంది. దీనిమీద కొన్ని ఆంగ్ల అక్షరాలు, కొన్ని నెంబర్లు ఉంటాయి. ఇలా మైలురాయి మీద ఉన్న ఒక్కో రంగు... ఆ రహదారికి సంబంధించిన సమాచారాన్ని సూచిస్తుంది. ఆ వివరాలు...
పసుపు-తెలుపు రంగుల మైలురాయి ఉంటే ఆ రహదారి నేషనల్ హైవే అని అర్థం. ఇలాంటి రోడ్లు దేశంలోని ప్రధాన నగరాలను, రాష్ట్రాలను కలుపుతుంటాయి. వీటిని సుదూర ప్రయాణాలు, వేగంగా వెళ్లే వాహనాలకు అనుకూలంగా రూపొందిస్తారు. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పసుపు రంగు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మైలురాయిమీద పసుపు రంగు వేసి ఎన్‌హెచ్ (నేషనల్ హైవే) నెంబరు రాస్తారు.
ఆకుపచ్చ-తెలుపు రంగుల మైలురాయి కనిపిస్తే ఆ రహదారి స్టేట్ హైవే అని అర్థం. ఈ రోడ్లు రాష్ట్రంలోని నగరాలను, పట్టణాలను కలుపుతాయి. వీటి మీద ఎస్‌హెచ్(స్టేట్ హైవే) నెంబరు ఉంటుంది.
నీలం లేదా నలుపు-తెలుపు రంగుల మైలురాయి... సిటీ రోడ్ లేదా డిస్ట్రిక్ట్ రోడ్‌లను సూచిస్తుంది. ఇవి పట్టణ కేంద్రాలు, మునిసిపాలిటీలను అనుసంధానిస్తాయి.
కాషాయం-తెలుపు రంగుల మైలురాయి... విలేజ్ రోడ్‌ను సూచిస్తుంది. ఈ రోడ్లు జిల్లాలోని గ్రామాలను కలుపుతుంటాయి. నారింజ రంగును గ్రామీణాభివృద్ధికి సూచికగా పరిగణిస్తారు. అందుకే గ్రామాల మధ్య రాకపోకలకు అనువుగా ఈ రోడ్లను నిర్మిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News