Share News

Mosquito Protection For Kids: దోమకాటు నుంచి పిల్లలకు రక్షణ ఇలా

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:40 AM

వానాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల పిల్లలకు చర్మ సంబంధిత అలెర్జీలు, రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాకాకుండా చిన్నారులను దోమలబారి నుంచి ఎలా కాపాడాలో తెలుసుకుందాం...

Mosquito Protection For Kids: దోమకాటు నుంచి పిల్లలకు రక్షణ ఇలా

వానాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల పిల్లలకు చర్మ సంబంధిత అలెర్జీలు, రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాకాకుండా చిన్నారులను దోమలబారి నుంచి ఎలా కాపాడాలో తెలుసుకుందాం...

  • చిన్న పిల్లలకు పొడవు చేతులు ఉన్న షర్టులు, ప్యాంట్లు వేయాలి. ముదురు రంగులు దోమలను ఆకర్షిస్తాయి. కాబట్టి పిల్లలకు లేత రంగుల బట్టలు వేయాలి. చేతులకు, పాదాలకు నిర్దేశిత సాక్స్‌లు వేయడం మంచిది.

  • మస్కిటో రిపెల్లెంట్‌ బ్యాడ్జెస్‌, పెండెంట్స్‌, ప్యాచె్‌సలను పిల్లలు వేసుకున్న డ్రెస్‌లకు జతచేయాలి. వీటిలో ఉండే యూకలిప్టస్‌, నిమ్మ, వేప, సిట్రోనెల్లా నూనెలు గాఢమైన వాసనలను వెదజల్లుతాయి. దీంతో దోమలు.. పిల్లల నుంచి దూరంగా వెళ్లిపోతాయి. ఈ నూనెలు సహజసిద్ధమైనవి. వీటి వల్ల పిల్లలకు ఎటువంటి అపాయమూ ఉండదు.

  • దోమలు ఇంట్లోకి రాకుండా కిటికీలు, తలుపులకు మ్యాగ్నెటిక్‌ మస్కిటో స్ర్కీన్‌లు లేదంటే మెష్‌లను ఏర్పాటు చేయాలి.

  • పిల్లలు నిద్రిస్తున్నప్పుడు వాళ్లపై నెట్‌ గొడుగులు ఉంచాలి. మంచానికి దోమతెరను కట్టినా ప్రయోజనం ఉంటుంది.

  • గదుల్లో, బాల్కనీల్లో సిట్రోనెల్లా, లావెండర్‌, బంతి పూల మొక్కల కుండీలు ఏర్పాటు చేస్తే దోమలు వెంటనే బయటికి వెళ్లిపోతాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 12:40 AM