Share News

Monsoon Health Tips: జలుబు చేయకుండా ఇలా

ABN , Publish Date - Aug 10 , 2025 | 04:57 AM

మనలో చాలామందికి వర్షాకాలంలో తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. దీంతో జ్వరం, తలనొప్పి, దగ్గు, తుమ్ములు వేధిస్తుంటాయి. అలాకాకుండా ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...

Monsoon Health Tips: జలుబు చేయకుండా ఇలా

మనలో చాలామందికి వర్షాకాలంలో తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. దీంతో జ్వరం, తలనొప్పి, దగ్గు, తుమ్ములు వేధిస్తుంటాయి. అలాకాకుండా ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...

  • అనుకోకుండా వర్షంలో తడిసినప్పుడు ఇంటికి రాగానే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. శరీరాన్ని, శిరోజాలను కాటన్‌ తువాలుతో తడిలేకుండా తుడుచుకోవాలి.

  • శరీరాన్ని వెచ్చగా ఉంచే దుస్తులు ధరించాలి.

  • అప్పుడే వండిన వేడి ఆహారాన్ని తీసుకోవాలి. ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని నీళ్లు తాగకూడదు. మంచినీటిని కొద్దిగా వేడి చేసుకుని తాగడం మంచిది. పలుచగా తయారుచేసిన పప్పు, మిరియాల చారు లాంటివాటిని భోజనంలో చేర్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.

  • రాత్రి పడుకునేముందు కొద్దిగా పసుపు కలిపిన గోరువెచ్చని పాలు లేదా తులసి-అల్లం టీ లాంటి వేడి పానీయాలు తాగితే ఊపిరితిత్తుల్లో శ్లేష్మం చేరదు. వేడి వేడి పాలలో అరచెంచా మిరియాలపొడి కలుపుకుని తాగినా జలుబు దరిచేరదు.

  • వర్షం వల్ల వాతావరణంలో హానికారక బ్యాక్టీరియాలు, వైరస్‌లు త్వరగా వ్యాప్తిచెందుతూ ఉంటాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి బలహీనమై పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వీటినుంచి బయటపడేందుకు నారింజ, దానిమ్మ, జామ లాంటి సి విటమిన్‌ అధికంగా ఉన్న పండ్లు తినాలి. బొప్పాయి, కివి పండ్లు కూడా మేలు చేస్తాయి. తరచూ నిమ్మ, ఉసిరిని ఆహారంలో చేర్చుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

  • ఉదయం లేవగానే జలుబు చేసిందనిపిస్తే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల నిమ్మరసం, రెండు చెంచాల తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగితే ఉపశమనంగా అనిపిస్తుంది. ఒక కప్పు గ్రీన్‌ టీ తాగినా ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 10 , 2025 | 04:58 AM