Aakujemudu Medicinal Uses: ఆకుజెముడు ఆకులతో ఆహార ఔషధం
ABN , Publish Date - Sep 06 , 2025 | 02:26 AM
రాతిబండలపై, నీటి వనరులు తక్కువగా ఉన్న పొడిబారిన నేలల్లో ఆకుజెముడు పొదలు పెరుగుతాయి. ఇది ఆముదం జాతికి చెందిన మొక్క. ఆకుజెముడును సంస్కృతంలో సేహుందా అని పిలుస్తారు. ఆయుర్వేదంలో...
భోజన కుతూహలం
రాతిబండలపై, నీటి వనరులు తక్కువగా ఉన్న పొడిబారిన నేలల్లో ఆకుజెముడు పొదలు పెరుగుతాయి. ఇది ఆముదం జాతికి చెందిన మొక్క. ఆకుజెముడును సంస్కృతంలో సేహుందా అని పిలుస్తారు. ఆయుర్వేదంలో దీనికి స్నుహి అనే శాస్త్రీయనామం ఉంది. తెలుగులో దీనిని ఆకుజెముడు లేదా కాడజెముడు అని పిలుస్తారు. ఆకుజెముడు ఆకులు, వేళ్లు, కాండం, కాండం నుండి వచ్చే పాలతో మధుస్నుహీరసాయనం లాంటి ఔషధాలు తయారవుతాయి. ఆకుజెముడు ఆకులు చాలా తీక్ష స్వభావం కలిగినవి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి ప్రయోజనాలివే..
ఆకుజెముడు ఆకుల రసం లేదా గుజ్జు రుచిని పుట్టిస్తాయి. అజీర్ణాన్ని పోగొడతాయి. పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.
కీళ్లవాతం, సయాటికా, నడుము నొప్పి, మెడనొప్పి మొదలైన వాటికి ఈ ఆకులు మంచి మందు. ఆకుజెముడు ఆకులను వేడి చేసి నెప్పి ఉన్న ప్రాంతంలో కట్టు కడితే ఉపశమనం లభిస్తుంది.
ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుకోవటం, దగ్గు, జలుబు మొదలైన వ్యాధులకు ఇది మంచి మందు.
చెవికి సంబంధించిన నరాల జబ్బులు, శరీరం వివిధ భాగాల్లో వచ్చే వాపులు, గడ్డలను తగ్గించటానికి కూడా ఈ ఆకులు ఉపకరిస్తాయి. ఈ ఆకుల రసాన్ని చెవిలో వేస్తే నెప్పి వెంటనే తగ్గుతుంది.
బొల్లి వంటి చర్మవ్యాధుల నివారణకు ఇది గొప్ప మందు.
లేత ఆకుల నుంచి పాలు కారుతూ ఉంటాయి. ఈ పాలు తీవ్రమైన మలబద్ధకం, రకరకాల విషప్రభావాలకు మంచి మందు.
గంగరాజు అరుణాదేవి
ఆకుజెముడు ఆకులను ముక్కలుగా కోసి మజ్జిగలో ఉడికించి.. పచ్చడిగా చేసుకొని తినవచ్చు.
ఈ ఆకులను ఎండబెట్టి పొడిచేసి గ్రీన్‌టీ మాదిరిగా తాగవచ్చు.
ఈ ఆకులు వేడి చేస్తాయి. అందువల్ల వీటిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..
మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి
Read Latest TG News and National News