Indian Passport Types: రంగు రంగుల పాస్‌పోర్ట్‌లకు అర్థం ఏంటో తెలుసా..
ABN , Publish Date - Sep 18 , 2025 | 02:17 AM
విదేశాల్లో... పర్యటించాలన్నా, చదువుకోవాలన్నా, ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలన్నా పాస్‌పోర్టు ఉండాల్సిందే. ఏ దేశంలోనైనా అధికారిక గుర్తింపు కార్డుగా పాస్‌పోర్టును పరిగణిస్తారు. అలాంటి పాస్‌పోర్టుకు...
విదేశాల్లో... పర్యటించాలన్నా, చదువుకోవాలన్నా, ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలన్నా పాస్‌పోర్టు ఉండాల్సిందే. ఏ దేశంలోనైనా అధికారిక గుర్తింపు కార్డుగా పాస్‌పోర్టును పరిగణిస్తారు. అలాంటి పాస్‌పోర్టుకు ఒక్కో దేశం ఒక్కో రంగును నిర్దేశించుకున్నాయి. యూరోపియన్ దేశాల్లో ఎరుపు, ఇస్లామిక్ దేశాల్లో ఆకుపచ్చ, ఆఫ్రికన్ దేశాల్లో నలుపు రంగు పాస్‌పోర్టులు కనిపిస్తుంటాయి. మనదేశంలో మాత్రం మూడు రంగుల పాస్‌పోర్టులు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం...
ముదురు నీలం రంగు పాస్‌పోర్టు
ఫ విద్య, ఉద్యోగం, పర్యాటకం, వ్యాపారం తదితరాల నిమిత్తం విదేశాలకు వెళ్లేవారికి ముదురు నీలం రంగు పాస్‌పోర్టును ఇస్తారు. భారతదేశంలో పుట్టినవారికి, ఇక్కడి పౌరసత్వం ఉన్నవారికి అత్యధిక సంఖ్యలో జారీ చేసే సాధారణ పాస్‌పోర్టు ఇది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, చిరునామా, పుట్టిన తేదీ తదితరాలను పరిశీలించి పోలీస్ వెరిఫికేషన్ తరవాత అర్హులైనవారికి మాత్రమే అందజేస్తారు. దీన్ని డిజిటల్ రూపంలో కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
తెలుపు రంగు పాస్‌పోర్టు
ఫ తెలుపు.. అధికారాన్ని బాధ్యతను సూచిస్తుంది. కాబట్టి తెలుపు రంగు పాస్‌పోర్టును ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, సైనిక బలగాలకు ప్రత్యేకించారు. కేవలం అధికారిక యాత్రలకు మాత్రమే దీన్ని నిర్ధేశించారు. వ్యక్తిగత ప్రయాణాలకు ఇది చెల్లుబాటు కాదు.
మెరూన్ రంగు పోస్‌పోర్టు
ఫ మెరూన్ రంగు పాస్‌పోర్టును.. విదేశాలతో దౌత్య సంబంధాలు నిర్వహించే అధికారులకు, గ్రూప్ ఎ ఫారెన్ సర్వీసెస్ అధికారులకు, విదేశాంగ శాఖలోని గ్రూప్ బి అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు మంజూరు చేస్తారు. విదేశాల్లో పనిచేసే భారతీయ అధికారులకు, దౌత్య సంబంధాల్లో భాగంగా విదేశాల్లో నివసించేవారికి కూడా దీన్నే ఇస్తారు.
నారింజ రంగు పాస్‌పోర్టు
ఫ పదోతరగతికి మించి చదవని వారికి నారింజ రంగు పాస్‌పోర్టును ఇచ్చేవారు. పాస్‌పోర్టు రంగును చూడగానే సంబంధిత వ్యక్తులు వివక్షతను ఎదుర్కొంటున్నారనే విమర్శలు రావడంతో ప్రస్తుతం దీన్ని జారీచేయడం లేదు.
Also Read:
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ
దమ్ముంటే అలా చెయ్యండి.. సూర్యకుమార్ యాదవ్‌కు ఆప్ నేత సవాల్..
For More Latest News