Hormonal Imbalance: పురుష హార్మోన్ క్షీణిస్తోంది
ABN , Publish Date - Sep 02 , 2025 | 03:54 AM
పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ క్రమేపీ దిగజారుతోంది. 1970ల నుంచి ప్రతి పదేళ్లకూ పురుషుల టెస్టోస్టెరాన్ దిగజారడం మొదలుపెట్టిందనీ, నేటి 22 ఏళ్ల వయసు పురుషుల్లో 1970ల నాటి 70 ఏళ్ల వృద్ధుల కంటే తక్కువ టెస్టోస్టెరాన్ ఉంటోందని...
తెలుసుకుందాం
పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ క్రమేపీ దిగజారుతోంది. 1970ల నుంచి ప్రతి పదేళ్లకూ పురుషుల టెస్టోస్టెరాన్ దిగజారడం మొదలుపెట్టిందనీ, నేటి 22 ఏళ్ల వయసు పురుషుల్లో 1970ల నాటి 70 ఏళ్ల వృద్ధుల కంటే తక్కువ టెస్టోస్టెరాన్ ఉంటోందని జోర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీలో ఒక అధ్యయనం ప్రచురితమైంది. అయితే ఈ పరిస్థితికి కారణాలు లేకపోలేదు. శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, ఊబకాయం, బిస్ఫినాల్ లాంటి పర్యావరణ కలుషితాలు, విషాలు, కదలకుండా గంటల తరబడి కూర్చోవడం, నిద్ర లేమి, ఆధునిక జీవితంతో ముడిపడి ఉండే తీవ్రమైన ఒత్తిడులే ఇందుకు ప్రధాన కారణాలుగా పరిశోధకులు పేర్కొంటున్నారు. టెస్టోస్టెరాన్ పురుష హార్మోన్ క్షీణించడం వల్ల కండర క్షీణత, లైంగిక కోరికలు సన్నగిల్లడం, అసలట, నిస్సత్తువలు వేధిస్తాయి. అయితే ఈ హార్మోన్‌ను సహజసిద్ధంగా పెంచుకునే మార్గాలెన్నో ఉన్నాయి. అవేంటంటే...
వ్యాయామం: వారానికి కనీసం ఐదు రోజుల పాటు క్రమం తప్పక వ్యాయామం చేయాలి
సమతులాహారం: ప్రొటీన్, పీచు ఎక్కువగా పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారం ఎంచుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి
ప్రాసెస్డ్ ఫుడ్స్: శుద్ధి చేసిన పదార్థాలు, చక్కెరతో తయారైన చిరుతిండ్లు బాగా తగ్గించాలి. శీతల పానీయాలు మానేయాలి
దురలవాట్లు: ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉండాలి
ఒత్తిడి: యోగా, ధ్యానంతో ఒత్తిడిని తగ్గించుకోవాలి
నిద్ర: నిద్రవేళలు క్రమం తప్పక పాటిస్తూ కంటి నిండా నిద్ర పోవాలి.
ఆహారం: కొవ్వుతో కూడిన చేపలు, గుల్ల చేపలు, గుడ్లు, అవకాడొ, ఉల్లి, వెల్లుల్లి, అల్లం, దానిమ్మ, డార్క్ చాక్లెట్, నట్స్, సీడ్స్ ఆహారంలో చేర్చుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
హరీష్ రావును టార్గెట్ చేసింది అందుకేనా..?
For More AP News And Telugu News