Share News

Path to Attain Shiva Consciousness: హృదయాన్ని శుభ్రపరుచుకుందాం

ABN , Publish Date - Oct 24 , 2025 | 01:43 AM

శివతత్త్వం అంటే శివుణ్ణి చేరుకొనే గమ్యం. ఆ తత్త్వాన్ని సాధించాలంటే... మనం పయనించాల్సింది మధ్యస్థమైన విష్ణు మార్గంలో, అంటే సుషుమ్నా మార్గంలో. దానినే ‘సోపాన మార్గం’ అంటారు..

Path to Attain Shiva Consciousness: హృదయాన్ని శుభ్రపరుచుకుందాం

సహజయోగ

శివతత్త్వం అంటే శివుణ్ణి చేరుకొనే గమ్యం. ఆ తత్త్వాన్ని సాధించాలంటే... మనం పయనించాల్సింది మధ్యస్థమైన విష్ణు మార్గంలో, అంటే సుషుమ్నా మార్గంలో. దానినే ‘సోపాన మార్గం’ అంటారు. అది సాధించాలంటే ఆ మార్గంలో ఉన్న ఆరు శక్తి కేంద్రాలు శుభ్రపడి, శక్తిని సంతరించు కోవాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం.

ప్రతికూలతలు తొలగాలి

సర్వశక్తిమంతుడైన సదాశివుడు మనహృదయంలో ఆత్మ స్వరూపునిగా కొలువై ఉన్నాడు. ఆయన సర్వ స్వతంత్రుడు, నిరంతరంగా, శాశ్వతంగా ఉండేవాడు. శివుని నివాస స్థానం అన్నిటికీ అతీతంగా... అంటే మన బుద్ధికన్నా, ఆలోచనలకన్నా ఉన్నతంగా ఉంటుంది. మనం శివతత్త్వాన్ని సంతరించుకోవాలంటే ముందుగా హృదయ పవిత్రతపై దృష్టి పెట్టాలి. మన హృదయంలో ఈర్ష్యకూ, దుష్ట ఆలోచనలకు తావు ఉండకూడదు. సంబంధిత శక్తికేంద్రాలు శుభ్రపడాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. ‘మనల్ని మనం తెలుసుకోవడం’ అంటే... మన ఆత్మను తెలుసుకోవడం. దాని కోసం శివుణ్ణి ఆరాధించాలి. ‘మనం ఆత్మ స్వరూపులం’ అని గ్రహించాలి.. హృదయం స్వచ్ఛంగా ఉన్నట్టయితే... మనలోని ఆత్మ... పరిశుభ్రమైన అద్దంలా ఉంటుంది. దాని మీద భగవంతుడి ప్రతిబింబం స్పష్టంగా ఉంటుంది. హృదయం ఈర్షతో, ద్వేషంతో నిండినట్టయితే... ఆ ప్రతిబింబం మసకబారుతుంది. మనం పూజ చేయడానికి ముందు స్నానం చేస్తాం. కానీ శుభ్రపరుచుకోవాల్సింది మన హృదయాన్ని. అందుకోసం మనలో అంతర్గతంగా ఉన్న ప్రతికూలతలను, మన పురోగతిని ఆటంకపరుస్తున్న అరిషడ్వర్గాలను తొలగించుకోవాలి. స్వచ్ఛమైన హృదయం ఉన్నప్పుడే భక్తి సాధ్యపడుతుంది.


ఆగుణాల జాగృతి కోసం...

శివతత్త్వాన్ని సాధించాలంటే... చిన్న చిన్న విషయాల్లో చిక్కుకుపోకూడదు. శివుడి నుంచి ప్రేమ ప్రవాహం సదా వెలువడుతూనే ఉంటుంది. అందులో మనకు స్థానం ఉండాలంటే... అర్థం లేని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. అప్పుడే మన చిత్తం ఆత్మ స్థానమైన హృదయంపైకి మళ్ళుతుంది. ఆత్మ ప్రకాశవంతం అవుతుంది. మనలోని లోపాలు తెలుస్తాయి. మాట్లాడే ప్రతి మాట హృదయం నుంచి వస్తుంది. సత్ప్రవర్తన పరిధులను అతిక్రమించకుండా ఉంటాం. సంపూర్ణ సంతృప్తితో జీవిస్తాం. మనలోని శక్తిని అసూయ, మోహం, శత్రుత్వం లాంటి ఉపయోగంలేని విషయాలతో వృధా చేసుకోకూడదు. అలాగైతేనే మనలోని ఆత్మ మన స్వభావంలో, వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో ప్రకాశిస్తుంది. సహజయోగ సాధన ద్వారా మనలోని శివతత్త్వం జాగృతం చేసుకున్నప్పుడు... మనలోని సూక్ష్మమైన గొప్ప గుణాలు జాగృతం అవుతాయి. ఈ కార్తిక మాసం శివుణ్ణి, విష్ణువును ఆరాధించడానికి ఎంతో అనువైన కాలం.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

ఈ వార్తలు కూడా చదవండి..

అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదు.. వైసీపీపై రఘరామ సెటైర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 01:43 AM