Share News

Lemon Health Benefits: రోజుకొక నిమ్మపండు

ABN , Publish Date - Aug 12 , 2025 | 04:09 AM

రోజుకొక యాపిల్‌ తినడం ఆరోగ్యకరం అని అనుకుంటూ ఉంటాం. అలాగే పలు పోషకాలతో కూడిన అరటి పండు కూడా బలవర్థకమే, కాబట్టి రోజుకొక అరటి పండు తినడం మంచిదని కూడా నమ్ముతూ ఉంటాం. కానీ ఈ రెండింటి కంటే నిమ్మ పండు...

Lemon Health Benefits: రోజుకొక నిమ్మపండు

ఆవిష్కరణ

రోజుకొక యాపిల్‌ తినడం ఆరోగ్యకరం అని అనుకుంటూ ఉంటాం. అలాగే పలు పోషకాలతో కూడిన అరటి పండు కూడా బలవర్థకమే, కాబట్టి రోజుకొక అరటి పండు తినడం మంచిదని కూడా నమ్ముతూ ఉంటాం. కానీ ఈ రెండింటి కంటే నిమ్మ పండు అన్ని విధాలా శ్రేయస్కరమని వైద్యులంటున్నారు. ఇలా ఎందుకంటున్నారో తెలుసుకుందాం!

న్యూజెర్సీకి చెందిన విలియం ప్యాటర్సన్‌ యూనివర్శిటీ, ప్రతి ఏటా పోషక విలువల ఆధారంగా పండ్లకు ర్యాంకులను కేటాయిస్తూ ఉంటుంది. అలా ఈ ఏడాది పోషక సాంద్రత, యాంటీఆక్సిడెంట్ల పరిమాణం, ఆరోగ్య ప్రయోజనాల ఆధారంగా, 41 రకాల పండ్లను విశ్లేషించి అన్నిటికంటే నిమ్మపండు ఆరోగ్యకరమని తేల్చింది. ఈ పండులో విటమిన్‌ సితో పాటు, పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయనీ, జేబులో ఇమిడిపోయే వీలున్న నిమ్మపండు జీర్ణశక్తినీ, రోగనిరోధకశక్తినీ పెంచుతుందనీ, గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందనీ పరిశోధకులు పేర్కొంటున్నారు. నిమ్మపండ్లు పుల్లగా ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. ఇవి ఆమ్ల గుణాన్ని కూడా కలిగి ఉంటాయి కాబట్టి నిమ్మరసాన్ని శరీరం శోషించుకున్నప్పుడు శరీరం మీద క్షార ప్రభావం పడుతుంది. ఫలితంగా శరీరంలోని పిహెచ్‌ సమతుల్యమై, పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. నిజానికి నిమ్మపండు కలిగి ఉండే ఆమ్లత్వం కూడా మేలు చేస్తుందనీ, వీటి పుల్లదనం వల్ల రోగనిరోధకశక్తి కుదుపుకు గురై అప్రమత్తమవతుఉందని కూడా పరిశోధకులు అంటున్నారు. నిమ్మపండుతో పాటు నిమ్మతొక్కలు కూడా ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. వీటిలోని లైమోనిన్‌ నూనెలు యాంటీ మైక్రోబియల్‌, యాంటీ క్యాన్సర్‌ గుణాలను కలిగి ఉంటాయి. కాబట్టి నిమ్మతోలును తురిమి వంటల్లో వాడుకుంటూ ఉండాలి.

ఇవీ చదవండి:

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్

పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం

Read Latest and Business News

Updated Date - Aug 12 , 2025 | 04:09 AM