Daily Kitchen Cleaning Tips: వీటినీ రోజూ శుభ్రం చేయాలి
ABN , Publish Date - Aug 10 , 2025 | 05:03 AM
ప్రతిరోజూ వంటింట్లో ఎన్నో వస్తువులు వాడతాం. వాటిలో కొన్నింటిని పైపైన మాత్రమే శుభ్రం చేస్తాం. దాంతో వాటి మీద బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం...
ప్రతిరోజూ వంటింట్లో ఎన్నో వస్తువులు వాడతాం. వాటిలో కొన్నింటిని పైపైన మాత్రమే శుభ్రం చేస్తాం. దాంతో వాటి మీద బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం..
చాపింగ్ బోర్డు: రోజూ కూరగాయలను కోసిన తరువాత చాపింగ్ బోర్డును నీటితో కడిగేసి పక్కన పెట్టేస్తారు. ఇలా చేయడం వలన అది పూర్తిగా శుభ్రం అవ్వదు దాంతో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. కాబట్టి రోజూ సబ్బు నీటితో చాపింగ్‌బోర్డును శుభ్రం చేయాలి. వారానికోసారి బ్లీచ్‌తో కూడా శుభ్రం చేయాలి.
సిలికాన్ బ్రష్‌లు: సిలికాన్ స్పూన్లు. స్పాచులాలు, బ్రష్‌లు వాడుతుంటాం. వీటిమీద కంటికి కనిపించని సన్నని రంధ్రాలుంటాయి. వాటిని వాడేటప్పుడు నూనె లాంటివి ఆ సన్నని రంధ్రాల్లోకి చేరతాయి. వీటిని కూడా పైపైన శుభ్రం చేస్తారు. వీటిని గోరువెచ్చని నీటిలో ఉంచి సబ్బు నీటితో శుభ్రం చేస్తే ఆ అవశేషాలు తొలగిపోతాయి.
రబ్బర్ వాచర్లు: ఏదో ఒకదాని కోసం తరచూ మిక్సీని వాడతాం. అయితే వాడిన తరువాత జార్‌లను శుభ్రం చేస్తారు. కానీ మిక్సీ గిన్నె మూతకు ఉండే వాచర్‌ను తీసి శుభ్రం చేయరు. దాంతో ఆ మఽధ్యలోకి బ్యాక్టీరియా చేరుతుంది. కాబట్టి వాడిన ప్రతిసారీ మిక్సీ జార్ మూత వాచర్లు తీసి శుభ్రం చేయాలి.
ఫ్రిడ్జ్ హ్యాండిల్: ఫ్రిజ్‌ను లోపల ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తాం. కానీ హ్యాండిల్‌ను మాత్రం శుభ్రం చేయరు. దాంతో ఆ పనులు చేస్తూ ఈ పని చేస్తూ ఫ్రిడ్జిని తెరవడం వలన హ్యాడింల్ జిడ్డుగా, మురికిగా మారుతుంది. కాబట్టి దానిని కూడా తరచూ శుభ్రం చేస్తుండాలి.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి