నవోదయ విద్యాలయలో అడ్మిషన్స్
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:26 AM
జవహర్ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ) సమితి 2026-27 విద్యా సంవత్స రంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీబీఎ్‌సఈ సిలబ్‌సలో బోధన ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు...
జవహర్ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ) సమితి 2026-27 విద్యా సంవత్స రంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీబీఎ్‌సఈ సిలబ్‌సలో బోధన ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఉచితంగా బోధించడంతోపాటు, వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫారమ్ కూడా అందిస్తారు.
అర్హతలు:
విద్యార్హత: జేఎన్‌వీకి దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ప్రైవేట్ / ప్రభుత్వ / ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో, 2025-26 విద్యా సంవత్సరంలో ఐదోతరగతి చదువుతూ ఉండాలి.
వయస్సు: విద్యార్థి 2014 మే1 నుంచి 2016 జూలై 31 తేదీ మధ్యలో(ఈ తేదీలతో సహా) జన్మించి ఉండాలి.
నివాసం: విద్యార్థి ఐదో తరగతి చదువుతో పాటు, అదే జిల్లాలో నివాసాన్ని కలిగి ఉండాలి.
సీట్లు: మొత్తం సీట్లను రూరల్, అర్బన్ కోటా కింద విభజిస్తారు. ప్రతి జేఎన్‌వీ పాఠశాలలో 80 సీట్లు ఉండగా గ్రామీణ విద్యార్థులకు 60 సీట్లు, నగర(అర్బన్) విద్యార్థులకు 20 సీట్లు లభిస్తాయి. గ్రామీణ కోటాలోకి రావాలంటే, విద్యార్థి 3వ, 4వ, 5వ తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. ఈ కాలంలో ఒక్క రోజు నగర పాఠశాలలో చదివినా, ఆ విద్యార్థులను నగర కోటాలో పరిగణలోకి తీసుకుంటారు.
పరీక్ష విధానం : పరీక్ష ఆబ్జెక్టీవ్ విధానంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 80 ప్రశ్నలు వస్తాయి.
పరీక్ష తరువాత ఒక ఎంపిక జాబితా విడుదల చేస్తారు.
ఎన్ని పాఠశాలలు: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 15 పాఠశాలలు ఉన్నాయి ఇందులో 13 పాత పాఠశాలలు కాగా ఈ సంవత్సరం కొత్తగా రెండింటిని చేర్చారు. తెలంగాణ ప్రస్తుతం 9 పాఠశాలలు ఉన్నాయి. కొత్తగా ఏడు పాఠశాలలు మంజూరైనప్పటికీ ఈ సంవత్సరపు నోటిఫికేషన్‌లో వాటిని చేర్చలేదు.
దరఖాస్తు చివరి తేదీ: 2025 జూలై 29
పరీక్ష తేదీ: 2025 డిసెంబర్ 13
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
వెబ్‌సైట్: https://navodaya.gov.inspector
విభాగం మార్కులు ప్రశ్నల సంఖ్య
మెంటల్ ఎబిలిటీ 50 40
గణితం 25 20
ఆంగ్లం 25 20
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. బాధ్యులపై కఠిన చర్యలు
కిషన్ రెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే రాజా సింగ్ పరోక్ష విమర్శలు
For AndhraPradesh News And Telugu News