Share News

Japanese Walking Method: ఈ జపనీస్‌ పద్ధతిలో ప్రయోజనాలెన్నో

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:22 AM

‘ఎలాంటి నడక వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి?’- చాలా కాలంగా ఈ విషయంపై చర్చ జరుగుతోంది. తాజాగా జపాన్‌కు చెందిన ‘ఇంటర్వెల్‌ వాకింగ్‌’ అనే పద్ధతికి ప్రపంచవ్యాప్తంగా...

Japanese Walking Method: ఈ జపనీస్‌ పద్ధతిలో ప్రయోజనాలెన్నో

‘ఎలాంటి నడక వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి?’- చాలా కాలంగా ఈ విషయంపై చర్చ జరుగుతోంది. తాజాగా జపాన్‌కు చెందిన ‘ఇంటర్వెల్‌ వాకింగ్‌’ అనే పద్ధతికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ఈ పద్ధతిలో మూడు నిమిషాలు వేగంగా నడుస్తారు. మరో మూడు నిమిషాలు నెమ్మదిగా నడుస్తారు. ఇలా వారానికి కనీసం నాలుగు సార్లు 30 నిమిషాల పాటు నడిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. జపాన్‌లో తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో ఈ తరహాలో నడిచేవారికి బీపీ తగ్గుతుందని.. కాళ్ల కీళ్ల నొప్పులు తగ్గాయని తేలింది. కేవలం శారీరక ప్రయోజనాలు మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వేగంగా నడిచి.. మళ్లీ నెమ్మదిగా నడవటం వల్ల ఎక్కువ శ్రమ అనిపించదని.. గాలిని ఒక క్రమ పద్ధతిలో పీల్చుకుంటారని వారు వెల్లడిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ను అరెస్ట్

Read Latest AP News and National News

Updated Date - Aug 21 , 2025 | 05:22 AM