Orange Kiwi Custard Recipe: ఆరెంజ్ కివి కస్టర్డ్
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:36 AM
స్వాతంత్య్రదినోత్సవం రోజున మువ్వన్నెల జెండాను ఎగురవేస్తాం. ఆ జెండాలోని మూడు రంగులను ప్రతిబింబించేలా తిరంగా ట్రీట్ తయారుచేసుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆస్వాదిస్తే...
తిరంగా ట్రీట్..!
స్వాతంత్య్రదినోత్సవం రోజున మువ్వన్నెల జెండాను ఎగురవేస్తాం. ఆ జెండాలోని మూడు రంగులను ప్రతిబింబించేలా తిరంగా ట్రీట్ తయారుచేసుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆస్వాదిస్తే... ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. అలాంటి తిరంగా ట్రీట్ తయారీ మీకోసం...
కావాల్సిన పదార్థాలు
వెనీలా కస్టర్డ్ పౌడర్- మూడు చెంచాలు, కివి పండ్లు- రెండు, ఆరెంజ్ జెల్లీ పౌడర్- ఒక ప్యాకెట్, పాలు- రెండు కప్పులు, పంచదార- రెండు చెంచాలు
తయారీ విధానం
కివి పండ్లను సన్నని చక్రాల్లా కోసుకోవాలి. ఒక గిన్నెలో మూడు కప్పుల వేడి నీళ్లు తీసుకుని ఆరెంజ్ జెల్లీ పౌడర్ వేసి కరిగించాలి. మరో గిన్నెలో ఒక కప్పు పాలు పోసి కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలపాలి.
స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక కప్పు పాలు పోసి పంచదార వేసి కరిగించాలి. తరువాత కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు పోస్తూ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాలు మరిగించి స్టవ్ మీద నుంచి దించాలి.
ఎనిమిది గాజు గ్లాసులను తీసుకొని ఒక్కోదానిలో రెండు కివి చక్రాలు వేయాలి. గ్లాస్‌లో సగం వరకు కస్టర్డ్ మిశ్రమాన్ని పోయాలి.
ఫ్రిజ్‌లో పావుగంటసేపు ఉంచాలి. తరువాత గ్లాసుల్లో ఆరెంజ్ జెల్లీ మిశ్రమం వేసి మరో అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత చల్లచల్లగా సర్వ్ చేసుకోవాలి.
చెఫ్: రూప నబర్, టిటికె ప్రిస్టేజ్
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News