Share News

Cooking oil care : వంట నూనె నిల్వ చేయాలంటే..!

ABN , Publish Date - Feb 05 , 2025 | 11:33 PM

బజారు నుంచి వంట నూనె కొని తేగానే సరిపోదు... దాన్ని సరైన పద్ధతిలో జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. అందుకు వారు ఇస్తున్న సూచనలివే...

Cooking oil care : వంట నూనె నిల్వ చేయాలంటే..!

బజారు నుంచి వంట నూనె కొని తేగానే సరిపోదు... దాన్ని సరైన పద్ధతిలో జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయంటున్నారు నిపుణులు. అందుకు వారు ఇస్తున్న సూచనలివే...

  • వంటనూనె ప్యాకెట్‌ లేదా బాటిల్‌ని చల్లని ప్రదేశంలో ఉంచాలి. వీటికి వెలుతురు ఎక్కువగా సోకకూడదు. ప్యాకెట్‌ని కత్తిరించినా, బాటిల్‌ మూత తీసినా ఆర్నెల్లలోపు నూనెని ఉపయోగించుకోవాలి.

  • ప్యాకెట్‌ లేదా బాటిల్‌ని ఎక్కువసేపు తెరచి ఉంచితే నూనెలోని కొవ్వు పదార్థాలు క్షీణిస్తాయి. నూనె రుచి మారుతుంది. దీనిని వాడడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయి. నూనె ప్యాకెట్‌ని కత్తిరించిన తరవాత గాలి చొరబడని డబ్బాలో భర్రపరచాలి. అదే బాటిల్‌ అయితే నూనెని తీసుకున్న తరవాత మూతని గట్టిగా బిగించాలి.

  • సాధారణంగా మహిళలు వంట చేసేటప్పుడు అందుబాటులో ఉండాలని కొద్దిగా నూనెని చిన్న స్టీల్‌ లేదా ప్లాస్టిక్‌ డబ్బాలో పోసి స్టవ్‌ పక్కన పెట్టుకుంటూ ఉంటారు. స్టవ్‌ నుంచి వచ్చే వేడి వల్ల ఈ నూనెలో ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతమవుతుంది. దీనిని ఆహారంలో ఉపయోగిస్తే ఊబకాయం, అల్జీమర్స్‌, అధిక కొలెస్ట్రాల్‌ లాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వంటనూనెని వేడి తగిలే ప్రదేశాల్లో ఉంచకూడదు.

  • నెయ్యితోపాటు వెజిటబుల్‌, వేరుశనగ, ఆవ, కొబ్బరి, నువ్వుల నూనెలను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవచ్చు.

  • నూనెలను జాడీ, గాజు లేదా లోహపు పాత్రల్లో ఉంచడం మంచిది.


మరిన్ని వార్తల కోసం..

PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు

Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2025 | 11:33 PM