Share News

Stay Fit Tips: వయసు పెరిగినా ఫిట్‌గా

ABN , Publish Date - Dec 08 , 2025 | 01:45 AM

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ శరీరంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. జీవక్రియలు మందగించడం, కండరాల పటుత్వం తగ్గడం, ఎముకలు బలహీనమవడం లాంటివి...

Stay Fit Tips: వయసు పెరిగినా ఫిట్‌గా

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ శరీరంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. జీవక్రియలు మందగించడం, కండరాల పటుత్వం తగ్గడం, ఎముకలు బలహీనమవడం లాంటివి ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చిన్న చిట్కాలతో శరీరాన్ని ఫిట్‌గా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం...

  • రోజూ ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. దీంతో కడుపు, పేగులు శుభ్రపడతాయి. కడుపు ఉబ్బరం, మలబద్దకం లాంటి సమస్యలు తొలగిపోయి శరీరం తేలికగా అనిపిస్తుంది. హెర్బల్‌ టీ లేదా గ్రీన్‌ టీ తాగినా కూడా శరీరంలోని టాక్సిన్లు విసర్జితమవుతాయి. రోజంతా కూడా తరచూ మంచినీళ్లు తాగుతూ ఉండాలి.

  • అధికంగా కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. తీపి పదార్థాలు, నూనె పదార్థాలతోపాటు ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తగ్గించడం మంచిది. కాలానుగుణంగా లభించే పండ్లు, ఉడికించిన కూరగాయలు, మొలకలను రోజూ ఆహారంలో చేర్చుకోవాలి.

  • ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కనీసం పావుగంటసేపు శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. దీనివల్ల శరీరానికి తగినంత డి విటమిన్‌ లభించి ఎముకలు, కండరాలు బలోపేతమవుతాయి.

  • రోజూ తేలికపాటి వ్యాయామం చేయడం, పార్కులో నడవడం, ఇంట్లో తోటపని చేయడం, సైకిల్‌ తొక్కడం లాంటివి అలవాటు చేసుకోవాలి. వీటివల్ల శరీరం బరువు పెరగకుండా నియంత్రణలో ఉంటుంది.

  • రోజూ కనీసం ఆరుగంటలు హాయిగా నిద్రపోవాలి. అప్పుడే ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరంలో కణాలు వృద్ధి పొందుతాయి. హార్మోన్లు సమతౌల్యంలో ఉంటాయి.

  • సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడపడం, స్మోకింగ్‌, ఆల్కహాల్‌ లాంటి అలవాట్లను మానుకోవాలి.

  • కనీసం ఆర్నెల్లకోసారి వైద్యుని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని

సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్

For More AP News And Telugu News

Updated Date - Dec 08 , 2025 | 01:45 AM