Postpartum Belly: ప్రసవం తరువాత పొట్ట తగ్గేదెలా..
ABN , Publish Date - Dec 25 , 2025 | 02:04 AM
కొంతమంది మహిళలకు ప్రసవం తరువాత కూడా పొట్ట ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిట్కాలతో దీన్ని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు....
కొంతమంది మహిళలకు ప్రసవం తరువాత కూడా పొట్ట ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిట్కాలతో దీన్ని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
నవజాత శిశువుకు పాలివ్వడం వల్ల తల్లి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే వైద్యులు సూచించిన ప్రకారం పొత్తి కడుపునకు బెల్టు పెట్టుకోవడం మంచిది.
ప్రసవం తరువాత వీలైనంత త్వరగా నడవడానికి ప్రయత్నించాలి. మొదట నెమ్మదిగా నిలబడి అడుగులు వేస్తూ క్రమంగా వేగం పెంచాలి. బిడ్డను ఎత్తుకుని నడవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
తరచూ వాము నీళ్లు తాగుతూ ఉంటే పొట్ట త్వరగా కరుగుతుంది. గర్భిణిగా ఉన్నప్పుడు పెరిగిన బరువు కూడా తగ్గుతారు. సోంపు నీళ్లు, జీలకర్ర నీళ్లు కూడా తాగవచ్చు.
గ్రీన్ టీ, హైబిస్కస్ టీ, చమోమిలే టీ లాంటి హెర్బల్ టీలు తాగడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడమే కాకుండా జీవక్రియలను వేగవంతం చేస్తాయి. దీనివల్ల మునుపటి రూపం సొంతమవుతుంది.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఎందుకిస్తారు.. విద్యార్థి సమాధానం వింటే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే..
పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి