Parenting Tips for a Bright Future: పిల్లలను ఇలా పెంచాలి
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:18 AM
తల్లిదండ్రుల పెంపకం మీదనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచీ పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు నేర్పించాలి. పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు..
తల్లిదండ్రుల పెంపకం మీదనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచీ పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు నేర్పించాలి. పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగాలి. వాళ్లమీద కోపంతో అరవకూడదు. పిల్లలకు తప్పు, ఒప్పులను వివరించి చెబుతూ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంట్లో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
పిల్లలను ఇతరులతో పోల్చకూడదు. వారి అభిరుచులను గుర్తించి తగిన ప్రోత్సాహం అందించాలి.
చెప్పిన పనులు చేయకుండా ఒక్కోసారి పిల్లలు మొండికేస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో పిల్లలను దగ్గర కూర్చోపెట్టుకుని బుజ్జగింపు ధోరణిలో పనులు చెప్పి చేయించాలి. ఆ పనులు పూర్తిచేసిన తరవాత కృతజ్ఞతా పూర్వకంగా మాట్లాడితే పిల్లలు సంబరపడతారు. మరోసారి చెప్పిన వెంటనే పనులు చేసేస్తారు కూడా!
పిల్లలకు రోజూ పోషకాహారం తినిపించాలి. సమయానుసారం నిద్రించేలా చూడాలి. వ్యాయామం, సైకిల్ తొక్కడం, ఈత లాంటివి అలవాటు చేయాలి.
తోటివారితో స్నేహంగా ఉండడం, అవసరమైతే సహాయ సహకారాలు అందించడం లాంటివాటిని పిల్లలకు నే ర్పించాలి. కష్టపడడం, నాయకత్వ లక్షణాలు, సమష్టి కృషి ఆవశ్యకతలను వివరించాలి.
మన సొంత అభిరుచులు, ఆశయాలను పిల్లలమీద రుద్దకూడదు. దీనివల్ల పిల్లల్లో ఒత్తిడి పెరిగి వారి సృజనాత్మక శక్తి దెబ్బతింటుంది. పిల్లల అభిప్రాయాలను అడిగి తెలుసుకోవాలి. వాళ్లకు ఇష్టమైన రంగంలో ఎదిగేలా తోడ్పాటును అందించాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు
ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు
Read Latest AP News And Telugu News