Parenting Tips: పిల్లలతో ప్రేమగా ఇలా
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:08 AM
పిల్లలను బాధ్యతాయుతంగా తీర్చిదిద్దే క్రమంలో తల్లిదండ్రులు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమతో ఎలా దారికి తెచ్చుకోవాలో తెలుసుకుందాం...
పిల్లలను బాధ్యతాయుతంగా తీర్చిదిద్దే క్రమంలో తల్లిదండ్రులు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమతో ఎలా దారికి తెచ్చుకోవాలో తెలుసుకుందాం...
చిన్న పిల్లలు సాధారణంగా పాఠశాలకు వెళ్లకుండా, హోంవర్క్ చేయకుండా మారాం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్లని కోప్పడకుండా మెల్లగా నచ్చచెప్పాలి. ప్రేమగా బుజ్జగిస్తూ చెపితే పిల్లలు తప్పకుండా మాట వింటారు.
ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ రోజూ పిల్లలను దగ్గర కూర్చోపెట్టుకుని వాళ్లతో మాట్లాడాలి. బడిలో లేదంటే హోంవర్క్‌కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అడిగి తెలుసుకోవాలి.
పిల్లలు మంచి పని చేసినప్పుడు అది ఎంత చిన్నదైనప్పటికీ మనస్ఫూర్తిగా అభినందించాలి. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు, ఆటపాటల్లో బహుమతులు సాధించినప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వాళ్లని ప్రోత్సహించాలి.
వీలైనప్పుడల్లా పిల్లలతో సమయం గడుపుతూ ఉండాలి. వాళ్లతో కలిసి బొమ్మలు గీయడం, ఆటలు ఆడడం లాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడే పిల్లల అభిరుచులు, ఆసక్తుల గురించి తెలుసుకునే వీలుంటుంది.
పిల్లలతో స్నేహంగా ఉండాలి. చీటికి మాటికి కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించకుండా మంచి, చెడు వివరిస్తూ ఉంటే పిల్లలు చక్కని వ్యక్తిత్వాన్ని అలవరచుకుంటారు.
పిల్లలకు క్రమశిక్షణ, సమయపాలన, వ్యాయామం అలవాటు చేయాలి. తోటివారికి సహాయం చేయడం, పెద్దలను గౌరవించడం, నైతిక విలువల గురించి వాళ్లకి అర్థమయ్యేలా తెలియజేయాలి.
పిల్లలు ఏ విషయం గురించి అయినా చెబుతుంటే ఓపికగా వినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే వాళ్లు కూడా వినడం, ఆలోచించడం, ఆచరించడం నేర్చుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News