Share News

Home Smelling Fresh: ఇల్లు సువాసనభరితంగా

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:55 AM

మనం ఎప్పుడైనా బయటకు వెళ్లి, తిరిగివచ్చి తలుపులు తెరవగానే ఇంట్లో నుంచి ఘాటైన వాసనలు రావడం గమనించే ఉంటాం. కిచెన్‌, బెడ్‌రూమ్‌, స్టడీ రూమ్‌, హాల్‌, వాష్‌రూమ్‌లలో సహజంగానే పలు రకాల...

Home Smelling Fresh: ఇల్లు సువాసనభరితంగా

మనం ఎప్పుడైనా బయటకు వెళ్లి, తిరిగివచ్చి తలుపులు తెరవగానే ఇంట్లో నుంచి ఘాటైన వాసనలు రావడం గమనించే ఉంటాం. కిచెన్‌, బెడ్‌రూమ్‌, స్టడీ రూమ్‌, హాల్‌, వాష్‌రూమ్‌లలో సహజంగానే పలు రకాల వాసనలు నిండి ఉంటాయి. వీటివల్ల ఒక్కోసారి చికాకుగా అనిపిస్తుంటుంది. అలాకాకుండా ఇల్లంతా సువాసనభరితంగా ఆహ్లాదకరంగా ఉండాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం...

  • ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటి తలుపులు, కిటికీలు తెరచి ఉంచాలి. అప్పుడే ఎండ, గాలి లోపలికి ప్రసరించి ఇంటిని ఆహ్లాదకరంగా మారుస్తాయి.

  • దుమ్ము, ధూళి, బూజు చేరకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. హాల్లో ఉండే సోఫాలు, కర్టెన్లు, కార్పెట్ల మీద కొద్దిగా బేకింగ్‌ సోడా చల్లి, వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేస్తే దుర్వాసనలు తొలగిపోయి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.

  • ప్రతి గదిలో ఇండోర్‌ ప్లాంట్‌ కుండీలను ఏర్పాటు చేసుకుంటే ఇల్లంతా తాజదనం నిండుతుంది. లావెండర్‌, రోజ్‌మేరీ, లెమన్‌గ్రాస్‌, యూకలిప్టస్‌, ఆర్కిడ్స్‌, పుదీనా, హనీసకేల్‌, గార్డెనియా లాంటి మొక్కలు ఇంటిని సువాసనలతో నింపేస్తాయి.

  • ప్రస్తుతం నిమ్మ, లావెండర్‌, గులాబీ, మల్లె, సంపెంగ లాంటి ఎన్నో రకాల ఎసెన్షియల్‌ ఆయిల్స్‌, అత్తర్లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో నచ్చినదాన్ని తెచ్చుకుని అప్పుడప్పుడు ఇల్లంతా స్ర్పే చేసుకోవచ్చు. దూది ఉండలమీద రెండు చుక్కల ఆయిల్‌ వేసి వాటిని గది మూలల్లో ఉంచినా ఫలితం ఉంటుంది.

  • రాత్రిపూట ఇంట్లో సువాసనలను వెదజల్లే ఆర్గానిక్‌ కొవ్వొత్తులు వెలిగించుకోవచ్చు. అవి వెలుగుతున్నంతసేపు ఇల్లంతా మంచి వాసన నిండుతుంది. ఆ సుంగంధాన్ని కర్టెన్లు, కార్పెట్లు, సోఫా కవర్లు కూడా శోషించుకుంటాయి. దీంతో రోజంతా ఇల్లు ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్

విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2025 | 12:55 AM