Children Brain Development: పిల్లల మేథస్సుకు
ABN , Publish Date - Dec 08 , 2025 | 01:48 AM
పిల్లలు చురుకుగా తెలివితేటలతో పెరగాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నప్పటినుంచే పిల్లలకు మంచి దినచర్యను అలవాటు చేయాలి...
పిల్లలు చురుకుగా తెలివితేటలతో పెరగాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నప్పటినుంచే పిల్లలకు మంచి దినచర్యను అలవాటు చేయాలి.
పిల్లలు రాత్రిపూట త్వరగా పడుకొని ఉదయాన్నే నిద్రలేచేలా చూడాలి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి పిల్లలు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది.
పిల్లలకు తరచూ మంచినీళ్లు తాగడం అలవాటు చేయాలి. దీనివల్ల శరీరం తేమతో నిండుతుంది. నీరసం, నిస్సత్తువ ఆవహించకుండా తక్షణ శక్తి లభిస్తుంది. వీటితోపాటు శరీరమంతా రక్తప్రసరణ సజావుగా జరగడం వల్ల మెదడు వేగంగా స్పందించగల్గుతుంది.
పిల్లలకు రోజూ వ్యాయామం చేయాలని చెప్పాలి. రోజూ నిద్రలేవగానే పిల్లలు వ్యాయామం చేస్తూ ఉంటే శరీరంలో ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో పిల్లలు చురుకుగా ఆలోచించగల్గుతారు.
రోజూ పిల్లలను ఉదయం పూట కాసేపు చదివించాలి. ఇలాచేయడం వల్ల పిల్లల్లో గుర్తుపెట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.
పిల్లలు అల్పాహారం మానేయకుండా చూడాలి. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, కోడిగుడ్లు, పాలు, పెరుగును రోజూ ఆహారంలో చేర్చాలి. వీటివల్ల పోషణ అంది మెదడు చురుకుగా పనిచేస్తుంది.
సాయంత్రం పూట పిల్లలచేత మెమరీ గేమ్స్, చదరంగం, సుడోకు, పజిల్ గేమ్స్ లాంటివి ఆడించాలి. వీటివల్ల పిల్లల్లో ఆలోచనా సామర్థ్యం, తెలివితేటలు పెరుగుతాయి.
పిల్లలకు యోగా, ఽధ్యానం లాంటివి అలవాటు చేయాలి. వీటివల్ల మెదడు ప్రశాంతంగా ఉల్లాసంగా మారుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
శాప్‌తో ఏసీఏ కలిసి అన్ని క్రీడలు ప్రోత్సహించేలా కృషి: ఎంపీ కేశినేని చిన్ని
సీఎం రేవంత్‌కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛాలెంజ్
For More AP News And Telugu News